సుఖోయ్ కూల్చాం..ఎస్- 400 ధ్వంసం చేశాం
ABN , Publish Date - Jun 09 , 2025 | 05:33 AM
ఆపరేషన్ సిందూర్ నిలిచి సుమారు నెల రోజులు అవుతున్నా.. పాకిస్థాన్ ఇంకా ఇలాంటి దుష్ప్రచారాన్ని ఆపలేదు. మార్ఫింగ్ చేసిన చిత్రాలు, ఎప్పటివో పాత ఫొటోల్లో కొంతభాగాన్ని చూపుతూ.. పాక్ దాడుల్లో భారత ఎయిర్‌బే్‌సలకు జరిగిన నష్టమంటూ..
ఆగని పాక్ దుష్ప్రచారం.. మార్ఫింగ్ చిత్రాలతో హోరు
న్యూఢిల్లీ, జూన్ 8: మన దేశంలోని ఆదంపూర్ ఎయిర్‌బే్‌సలో సుఖోయ్-30ఎంకేఐ విమానంపై పాక్ క్షిపణి దాడి చేసిందా? గుజరాత్‌లోని భుజ్ వైమానిక దళ స్థావరంలో ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిందా?.. ఆపరేషన్ సిందూర్ నిలిచి సుమారు నెల రోజులు అవుతున్నా.. పాకిస్థాన్ ఇంకా ఇలాంటి దుష్ప్రచారాన్ని ఆపలేదు. మార్ఫింగ్ చేసిన చిత్రాలు, ఎప్పటివో పాత ఫొటోల్లో కొంతభాగాన్ని చూపుతూ.. పాక్ దాడుల్లో భారత ఎయిర్‌బే్‌సలకు జరిగిన నష్టమంటూ.. ఆ దేశ మీడియా, సోషల్ మీడియా వేదికగా ప్రచారం హోరెత్తుతోంది. అవన్నీ ఉత్త అబద్ధాలేనని తాజాగా ప్రముఖ విశ్లేషకుడు డామియెన్ సిమన్ ఆధారాలతో సహా తేల్చేశారు. ఆదంపూర్ ఎయిర్‌బే్‌సలో సుఖోయ్ విమానాన్ని, ఎస్-400 వ్యవస్థను, భుజ్ ఎయిర్‌బే్‌సలో మరో ఎస్-400 వ్యవస్థను, నలియా, శ్రీనగర్ ఎయిర్‌బే్‌సలు, జమ్మూ విమానాశ్రయంలో రన్‌వేలను, నిర్మాణాలను ధ్వంసం చేసినట్టు పాక్ మీడియా చూపుతున్న చిత్రాలు మార్ఫింగ్ చేసినవని, కొన్ని పాత ఫొటోలని స్పష్టం చేశారు. గత నెల రోజుల్లో ఆయా ఎయిర్‌బే్‌సలకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి.. అక్కడ ఎలాంటి నష్టం జరగలేదని వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట
For Telangana News And Telugu News