Share News

Pakistani Public Anger: తమ ఆర్మీ వాళ్లు సన్నాసులంటూ పాక్ జనాల తిట్లు

ABN , Publish Date - May 08 , 2025 | 09:38 PM

పాక్ ఆర్మీ తమకు అబద్ధాలు చెబుతోంటూ పాక్ ప్రజలు తిట్టిపోస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Pakistani Public Anger: తమ ఆర్మీ వాళ్లు సన్నాసులంటూ పాక్ జనాల తిట్లు
Pakistani Public Ange

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌ను రెచ్చగొట్టి తమ దేశాన్ని యుద్ధం అంచులకు చేర్చిన పాక్ ఆర్మీపై అక్కడి ప్రజల్లోనే ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఆర్మీ చెబుతున్న అబద్ధాలను ఈసడించుకుంటున్న జనాలు తమ ఆక్రోశాన్ని నెట్టింట వెళ్లగక్కుతున్నారు. పాక్ ఆర్మీ చేతకాని తనాన్ని తిట్టిపోస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు అనేకం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజా వీడియోలో ఓ పాకిస్థానీ తమ దేశ ఆర్మీని సన్నాసులంటూ తిట్టిపోశాడు.

పాక్ ఆర్టిలరీ దాడులకు ప్రతిగా భారత్.. దాయాది దేశంలోని గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. అయితే, ఈ దాడులను కప్పిపుచ్చుకునేందుకు, తమ చేతకాని తనాన్ని కవర్ చేసేందుకు ఆర్మీ అధికారులు స్థానికులకు రకరకాల కథలు వినిపిస్తున్నారు. రావల్పిండిలో జరిగిన భారత దాడిని పిడుగుపాటుగా స్థానికులకు చెప్పుకున్నారు. దీనిపై ఓ పాకిస్థానీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెట్టింట వీడియో పెట్టాడు.


వీళ్లెంత సన్నాసులు.. అక్కడ పిడుగుపడిందని చెబుతున్నారు. ఇలాంటి అబద్ధాలు చెబుతున్నందుకు వీళ్లకు సిగ్గు ఎందుకు లేదో’’ అంటూ వీడియో పోస్టు చేశారు. ఇది ప్రస్తుతం అనేక వేదికల్లో వైరల్‌గా మారింది. ఆర్మీపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి చిహ్నంగా నిలిచింది. భారత్‌ను బూచిగా చూపించి ప్రజల్లో తన ఫాలోయింగ్ పెంచుకునేందుకు ప్రయత్నించే పాక్ ఆర్మీకి ఈసారి మాత్రం ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు.


కాగా, అంతకుముందు ఇస్లామాబాద్‌కు చెందిన లాల్ మసీద్ మత పెద్ద కూడా పాక్ ఆర్మీపై మండిపడ్డాడు. భారత్‌తో యుద్ధం జరిగితే మీరు పాక్ ఆర్మీకి మద్దతు ఇస్తారా అని ఆయన అడగ్గా చాలా తక్కువ మంది తమ చేతులు ఎత్తారు. దీనిపై స్పందించిన ఆయన పాక్ ప్రజలకు ఇప్పుడు అన్నీ తెలిసిపోయాయని వ్యాఖ్యానించారు. భారత్ పాక్ మధ్య యుద్ధమంటే ఇస్లామిక్ యుద్ధం కాదని ఇప్పుడు అందరికీ అర్థమైపోయిందని తెలిపారు. పాక్‌లో ఉన్న అణిచివేత భారత్‌లో కూడా లేదని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

భారత్‌తో ఉద్రిక్తతలు.. పాక్‌ జాతీయులకు తాలిబాన్ వార్నింగ్

భారత్-పాక్ ఉద్రిక్తతల వెనక చైనా కుట్ర ఉంది.. అమెరికా వ్యాపారవేత్త కామెంట్ వైరల్

భారత్‌తో ఉద్రిక్తతలు.. మనం పాపులం అంటూ జాతీయ అసెంబ్లీలో పాక్ నేత కన్నీరు

Read Latest and National News

Updated Date - May 08 , 2025 | 09:45 PM