Share News

Karwar Port: ఇరాక్‌ స్టీమర్‌లో పాకిస్థానీ.. కారవార ఓడరేవులో దిగనివ్వని పోలీసులు

ABN , Publish Date - May 15 , 2025 | 05:55 AM

ఉత్తర కన్నడ జిల్లా కేంద్రంలోని కారవార ఓడరేవుకు వచ్చిన ‘ఎంటీఆర్‌ ఓషియన్‌’ సరుకు రవాణా స్టీమర్‌ నుంచి పాకిస్థానీని కిందకు దిగనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు.

Karwar Port: ఇరాక్‌ స్టీమర్‌లో పాకిస్థానీ.. కారవార ఓడరేవులో దిగనివ్వని పోలీసులు

బెంగళూరు, మే 14(ఆంధ్రజ్యోతి): ఉత్తర కన్నడ జిల్లా కేంద్రంలోని కారవార ఓడరేవుకు వచ్చిన ‘ఎంటీఆర్‌ ఓషియన్‌’ సరుకు రవాణా స్టీమర్‌ నుంచి పాకిస్థానీని కిందకు దిగనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇరాక్‌లోని జుబైర్‌ నుంచి ఈ నెల 12న కారవార ఓడరేవుకు స్టీమర్‌ చేరుకుంది. అందులో 15 మంది భారతీయులు, ఇద్దరు సిరియావాసులు, ఒక పాకిస్థానీ ఉన్నారు. స్టీమర్‌లో పాకిస్థానీ ఉన్న విషయాన్ని ఓడరేవుల శాఖ అధికారులు తీరం గస్తీ బృందానికి తెలియజేశారు. దీంతో కారవార పోలీసులు, ఓడరేవు రక్షణ సిబ్బంది అతడిని కిందకు రానివ్వకుండా నిలుపుదల చేశారు.


అతడి మొబైల్‌, ఇతర వస్తువులను కెప్టెన్‌ ద్వారా స్వాధీనం చేసుకున్నారు. స్టీమర్‌లోని సరుకును దించేందుకు రెండు రోజులు పట్టింది. కారవార నుంచి స్టీమర్‌ బుధవారం షార్జాకు బయలుదేరింది. అందులో పాకిస్థానీని పంపేశారు. మరోవైపు, ఒడిశాలోని పారాదీప్‌ ఓడరేవుకు బుధవారం 21 మంది పాకిస్థాన్‌కు చెందిన సిబ్బందితో క్రూడాయిల్‌ నౌకఒకటి రావడంతో ఆ రాష్ట్ర పోలీసులు అప్రమత్తమై అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు.

Updated Date - May 15 , 2025 | 05:55 AM