Afzal Khan: యుద్ధం వస్తే ఇంగ్లండ్ వెళ్లిపోతా
ABN , Publish Date - May 05 , 2025 | 04:54 AM
భారత్‌తో యుద్ధం వస్తే ఇంగ్లండ్‌కి పారిపోతానని పాక్ ఎంపీ అఫ్జల్ ఖాన్ వ్యాఖ్యానించారు. మోదీ వెనక్కి తగ్గాలని నేను చెప్పాలా? అంటూ ఆయన చేసిన వెటకార వ్యాఖ్యలు దేశంలో కలకలం రేపాయి.
న్యూఢిల్లీ, మే 4: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతుందేమోనని భయాందోళనల నేపథ్యంలో పాక్ ఎంపీ షేర్ అఫ్జల్ ఖాన్ మర్వాత్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ పరిస్థితిని చెబుతున్నాయి. భారత్‌తో యుద్ధం మొదలైతే దేశం వదిలి ఇంగ్లండ్ వెళ్లిపోతానని అఫ్జల్ ఖాన్ అన్నారు. ఒకవేళ భారత్‌తో యుద్ధం ప్రారంభమైతే తుపాకీ తీసుకుని మీరు కూడా సరిహద్దుకు వెళతారా ? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చి షాకిచ్చారు. అంతేకాక, ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత ప్రధాని మోదీ యుద్ధం విషయంలో వెనక్కి తగ్గే అవకాశముందా ? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కూడా వింత సమాధానం ఇచ్చారు. ‘మోదీ ఏమైనా మా అత్త కొడుకా ? నేను చెబితే వెనక్కి తగ్గడానికి’ అంటూ వెటకారం చేశారు.
ఇవి కూడా చదవండి
Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..
India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్
Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన
For National News And Telugu News