Share News

Pakistan: ఉగ్రవాదంపై సంయుక్త ప్రకటన ఏకపక్షం

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:26 AM

ట్రంప్‌తో మోదీ భేటీ నేపథ్యంలో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గతంలో ఒప్పందం మేరకు తమ భూభాగం సీమాంతర ఉగ్రదాడులకు వేదిక కాకుండా చూసుకోవాలని ఆ ప్రకటనలో పాక్‌కు సూచించారు.

Pakistan: ఉగ్రవాదంపై సంయుక్త ప్రకటన ఏకపక్షం

అమెరికా-భారత్‌ ప్రకటనపై పాక్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: సీమాంతర ఉగ్రవాదంపై అమెరికా-భారత్‌ సంయుక్త ప్రకటన ఏకపక్షం అని పాకిస్థాన్‌ ఆరోపించింది. ద్వైపాక్షిక సంబంధాలు మూడో పక్షానికి హాని చేయకూడదని చైనా వ్యాఖ్యానించింది. ట్రంప్‌తో మోదీ భేటీ నేపథ్యంలో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గతంలో ఒప్పందం మేరకు తమ భూభాగం సీమాంతర ఉగ్రదాడులకు వేదిక కాకుండా చూసుకోవాలని ఆ ప్రకటనలో పాక్‌కు సూచించారు. దీనిపై పాక్‌ విదేశీ వ్యవహారాల ప్రతినిధి షఫ్‌ఖత్‌ ఆలీ ఖాన్‌ వెంటనే స్పందించారు. ఇది ఏకపక్షమని, తప్పుదారి పట్టించారని, దౌత్య నిబంధనలను విరుద్ధమంటూ విమర్శించారు. తమ త్యాగాలను గుర్తించకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆక్రోశం వెళ్లగక్కారు.


ఇవి కూడా చదవండి...

PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు

CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ

Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2025 | 05:26 AM