Share News

India Extends Deadline: పాకిస్థానీలు భారత్‌ వీడేందుకు గడువు పొడిగింపు

ABN , Publish Date - May 02 , 2025 | 04:49 AM

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ జాతీయుల నుంచి భారత్‌ వెళ్లిపోవడానికి విధించిన గడువును కేంద్రం నిరవధికంగా పొడిగించింది. ఇప్పటివరకు 911 మంది పాక్ జాతీయులు భారత్ నుండి వెళ్ళిపోయారు, వాఘా-అటారీ సరిహద్దు వద్ద 80 ఏళ్ల వయసున్న పాక్ జాతీయుడు మృతి చెందాడు.

India Extends Deadline: పాకిస్థానీలు భారత్‌ వీడేందుకు గడువు పొడిగింపు

మానవతా దృక్పథంతో గడువు సవరించిన కేంద్రం

న్యూఢిల్లీ, మే 1: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ జాతీయులు భారత్‌ నుంచి వెళ్లిపోయేందుకు విధించిన గడువును కేంద్రం నిరవధికంగా పొడిగించింది. తొలుత ఏప్రిల్‌ 30 వరకు మాత్రమే భారత్‌ గడువు విధించింది. అయితే వాఘా-అటారీ సరిహద్దు వద్ద తమ జాతీయులను గుర్తించి లోపలికి అనుమతించడంలో పాక్‌ అధికారులు చురుగ్గా వ్యవహరించడం లేదు. దీంతో పెద్ద సంఖ్యలో పాక్‌ జాతీయులు వాఘా-అటారీ సరిహద్దు వద్ద వేచి చూస్తున్నారు. ఈ తరుణంలో భారత్‌ మానవతా దృక్పథంతో గడువును సవరించింది. దీంతో పాక్‌ జాతీయులకు ఊరట లభించినట్లైంది. మరోవైపు ఇప్పటివరకు 911 మంది పాక్‌ జాతీయులు భారత్‌ నుంచి వెళ్లిపోయారు. కాగా, వాఘా-అటారీ సరిహద్దు ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌ వద్ద అబ్దుల్‌ వహీద్‌ భట్‌ అనే 80 ఏళ్ల పాక్‌ జాతీయుడు మృతి చెందాడు. 1980లోనే వీసా గడువు ముగిసినా భారత్‌లో ఉన్న భట్‌ పక్షవాతంతో బాధపడుతున్నాడు.


ఇవి కూడా చదవండి

ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు

Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2025 | 04:49 AM