Share News

Military Official: నీటిని ఆపేస్తే.. మీ పీక నొక్కేస్తాం: పాక్‌ అధికారి

ABN , Publish Date - May 24 , 2025 | 05:35 AM

సింధూ జలాల ఒప్పందం రద్దుపై పాకిస్థాన్‌ సైనిక ప్రతినిధి ఒకరు భారత్‌పై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Military Official: నీటిని ఆపేస్తే.. మీ పీక నొక్కేస్తాం: పాక్‌ అధికారి

న్యూఢిల్లీ, మే 23: సింధూ జలాల ఒప్పందం రద్దుపై పాకిస్థాన్‌ సైనిక ప్రతినిధి ఒకరు భారత్‌పై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఓ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌధరి మాట్లాడుతూ, ‘మా దేశానికి రావాల్సిన సింధూ జలాలను మీరు అడ్డుకుంటే.. మీ పీక నొక్కేస్తాం’ అంటూ నోరు పారేసుకున్నారు.


లష్కరే తొయిబా చీఫ్‌ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ తరహాలో ఒక ఆర్మీ అధికారి మాట్లాడటం వివాదాస్పదమైంది. ఆయన వ్యాఖ్యలను అఫ్ఘాన్‌ రాజకీయ నాయకురాలు, మాజీ ఎంపీ మరియం సొలైమాంఖిల్‌ తీవ్రంగా ఖండించారు. ‘మీరు నీటిని ఆపేస్తే.. మేం మీ ఊపిరి ఆపేస్తాం’ అంటూ గతంలో హఫీజ్‌ చేసిన వ్యాఖ్యలను షరీఫ్‌ కాపీ కొట్టినట్లుందని అన్నారు.

Updated Date - May 24 , 2025 | 05:35 AM