India Air Defense: వాయుసేనలో మోగిన భేరి.. ఇక పాక్‌కు చుక్కలే..
ABN , Publish Date - May 04 , 2025 | 05:29 AM
పాకిస్థాన్ భారత్ పై యుద్ధం చేసే అవకాశాన్ని భయపడుతోంది. ఆ నేపథ్యంలో భారత్ తన వాయు సేనను బలోపేతం చేసుకునేందుకు కొత్త ఆయుధాలతో సన్నద్ధమవుతోంది.
45 లాంచర్లు... 85 విధ్వంసక మిస్సైళ్లు
టెండర్లు పిలిచిన రక్షణ శాఖ
న్యూఢిల్లీ, మే 3: పహల్గాం ఉగ్ర దాడి అనంతర పరిణామాల్లో తమపై ఎప్పుడైనా భారత్ యుద్ధానికి దిగొచ్చునని దాయాది దేశం పాకిస్థాన్ భయపడుతోంది. దానికి తగినట్టే మనదేశ సైనిక నిర్ణయాలు యుద్ధ సన్నద్ధతను సూచిస్తున్నాయి. తాజాగా కొత్త తరం ఆయుధశక్తితో వాయు సేనను బలోపేతం చేసుకునేందుకు భారత్ సిద్ధమైంది. భుజంపై పెట్టుకుని ప్రయోగించడానికి వీలైన 45 లాంచర్లు, 85 మిస్సైళ్లు, 48 నైట్ విజన్ పరికరాల కొనుగోలుకు శనివారం టెండర్లు పిలిచింది. క్షణాల్లో శత్రు లక్ష్యాలను ఛేదించగలిగే విధ్వంసక శక్తి ఈ మిస్సైళ్లకు ఉంది.
‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా సాయుధశక్తిని బలోపేతం చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసకున్నామని సైనికవర్గాలు చెబుతున్నాయి. అయితే, పాక్‌తో తథ్యం అని భావిస్తున్న యుద్ధానికి దీనిని సన్నాహంగా మిలిటరీ నిపుణులు అనుమానిస్తున్నారు. భూతలానికి అతి సమీపంనుంచి, స్వల్ప దూరంనుంచి దాడులు చేసే శత్రు యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను ఈ కొత్త తరం వాయు రక్షణ వ్యవస్థ ((వీఎ్‌సహెచ్‌వోఆర్‌ఏడీఎస్) కనురెప్పపాటులో నేలకూల్చగలదు.
భూతలంపై పోరాడే సైన్యానికి రక్షణ కవచంగా ఉంటుంది. ‘‘గగనతలదాడుల నుంచి కాపాడే విధ్వంసక, రక్షణ వాయు వ్యవస్థ మనకు కావాలి. ఈ వ్యవస్థ ఇన్‌ఫ్రా రెడ్ హోమింగ్ (ఐఆర్) టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఫైర్ అండ్ ఫర్గెట్ తరహా మిస్సైల్ వ్యవస్థ ఇది’’ అని టెండర్ నోటీసులో (ఆసక్తి వ్యక్తీకరణ) రక్షణ శాఖ తెలిపింది. ఈ మిస్సైళ్ల రేంజ్ ఆరువేల మీటర్లకు మించి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి
IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..