Share News

BSF: అమృత్‌సర్‌లో ఉగ్ర కుట్ర భగ్నం

ABN , Publish Date - May 02 , 2025 | 04:44 AM

భారత్-పాక్ సరిహద్దు వద్ద మరో ఉగ్రకోణాన్ని భద్రతా దళాలు తక్షణమే భగ్నం చేశాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి, భారత సైన్యం పాక్ కాల్పులకు సమర్థంగా బదులిచ్చింది.

BSF: అమృత్‌సర్‌లో ఉగ్ర కుట్ర భగ్నం

భారీగా ఆయుధాల స్వాధీనం

తుపాకులు, గ్రనేడ్లు ఉండటంతో కలకలం

బీఎ్‌సఎఫ్‌, పంజాబ్‌ పోలీసుల ఆపరేషన్‌

న్యూఢిల్లీ, మే 1: భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో మరో ఉగ్ర కుట్ర భగ్నమైంది. అమృత్‌సర్‌ జిల్లాలోని భరోపాల్‌ గ్రామం సమీపంలో ఉగ్ర కుట్రను సరిహద్దు భద్రతా దళం(బీఎ్‌సఎఫ్‌) భగ్నం చేసింది. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది. బీఎ్‌సఎఫ్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం అందించిన విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం సాయంత్రం పంజాబ్‌ పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా భద్రతా దళాలు 2 హ్యాండ్‌ గ్రనేడ్లు, 3 పిస్టళ్లు, 6 మ్యాగజీన్లు, 50 రౌండ్ల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు నిమిత్తం వాటిని స్థానిక పోలీసులకు అప్పగించారు.

ఆగని పాక్‌ కవ్వింపు చర్యలు

పహల్గాం ఉగ్రదాడి అనంతరం సరిహద్దుల్లో పాక్‌ కవ్విపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. నియంత్రణ రేఖ వెంబడి భారత పోస్టులను లక్ష్యంగా చేసుకొని పాక్‌ సైన్యం జరిపిన కాల్పు లు వరుసగా ఏడోరోజు గురువారం రాత్రి కూడా కొనసాగాయి. ‘ఏప్రిల్‌ 30 -మే 1 అర్ధరాత్రి వేళ జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా, ఉరీ, అఖ్నూర్‌ ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ దళాలు కాల్పులకు తెగబడ్డాయి. చిన్నపాటి ఆయుధాలతో పాక్‌ బలగాలు జరిపిన కాల్పులకు భారత సైన్యం దీటుగా బదులిచ్చింది’ అని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇరు దేశాలకు చెందిన మిలటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్లు గత మంగళవారం హాట్‌లైన్‌లో మాట్లాడుకున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్‌ సైన్యం కాల్పులకు పాల్పడుతున్న విషయా న్ని ప్రస్తావించిన భారత్‌.. దాయాది దేశానికి గట్టి హెచ్చరికలు జారీ చేసింది.


అరేబియా సముద్రంలో గస్తీ ముమ్మరం

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆరేబియా సముద్రంలో భారత నావికా దళం గస్తీని ముమ్మరం చేసింది. సముద్ర భద్రతను బలోపేతం చేసే దిశగా యుద్ధ నౌకలను మోహరించడంతో పాటు యాంటీ-షిప్‌, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్‌ మిసైళ్ల ప్ర యోగాలను విజయవంతంగా నిర్వహించినట్లు నేవీ వర్గాలు ధ్రువీకరించాయి. గుజరాత్‌ తీరంలోని అంతర్జాతీయ సముద్ర సరిహద్దు సమీపంలో భారత కోస్ట్‌ గార్డ్‌ సైతం నౌకలను మోహరించింది.


ఇవి కూడా చదవండి

ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు

Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2025 | 04:45 AM