Share News

పాక్‌ ఆర్మీ ప్రెస్‌ చీఫ్‌కు ‘ఉగ్ర గతం’

ABN , Publish Date - May 11 , 2025 | 04:13 AM

ఆపరేషన్‌ సిందూర్‌ దాడుల సమాచారాన్ని పాక్‌కోణం నుంచి మూడురోజులుగా అందిస్తున్న ఆ దేశ ఆర్మీ ప్రెస్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌధురీకి ఉగ్రవాద చీకటి గతంతో సంబంధం ఉంది.

పాక్‌ ఆర్మీ ప్రెస్‌ చీఫ్‌కు ‘ఉగ్ర గతం’

  • అణు శాస్త్రవేత్తగా పనిచేసిన ఈయన తండ్రికి అల్‌కాయిదా, ఒసామాతో నేరుగా సంబంధాలు

న్యూఢిల్లీ, మే 10 : ఆపరేషన్‌ సిందూర్‌ దాడుల సమాచారాన్ని పాక్‌కోణం నుంచి మూడురోజులుగా అందిస్తున్న ఆ దేశ ఆర్మీ ప్రెస్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌధురీకి ఉగ్రవాద చీకటి గతంతో సంబంధం ఉంది. అల్‌కాయిదాతో సంబంధాలు కలిగిఉన్నారని, అణ్వాయుధాల కార్యక్రమానికి సంబంధించిన కీలక అంతర్గత సమాచారం ఉగ్రవాదులకు చేరవేశారనే అభియోగాలు ఈయన తండ్రి, రిటైర్డు అణు శాస్త్రవేత్త సుల్తాన్‌ బషీరుద్దీన్‌ మహమ్మద్‌పై ఉన్నాయని భారతీయ అధికార వర్గాలు వెల్లడించాయి. బషీరుద్దీన్‌కు ఒసామాబిన్‌ లాడెన్‌తో నేరుగా మాట్లాడేంతగా దగ్గరి సంబంధాలు ఉండేవని తెలిపాయి.


పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పుట్టిన ఈయన పాకిస్థాన్‌ అణుశక్తి సంస్థలో పనిచేసి 2001లో పదవీవిరమణ పొందారు. మతాన్ని, సైన్సును కలిపి ఇస్లామిక్‌ దృక్కోణంలో అనేక పుస్తకాలు రాశారు. ఒసామా బిన్‌ను తాను కలిసినట్టు అంగీకరించడంతో 2001లో సుల్తాన్‌ను అరెస్టు చేశారు. అయితే, అణు రహస్యాలను ఉగ్రవాదులకు చేరవేసేంత సాంకేతిక జ్ఞానం ఆయనకు లేవని నిర్ధారించుకుని వదిలేశారు. ఆయనను అమెరికా బ్లాక్‌లిస్టులో పెట్టింది. స్పెషల్లీ డిజిగ్నేటెడ్‌ నేషనల్స్‌ జాబితాలో (ఎస్‌డీఎన్‌) ఆయన పేరు చేరింది.

Updated Date - May 11 , 2025 | 04:13 AM