Share News

Asaduddin Owaisi: పాకిస్థాన్‌ ఓ విఫల దేశం

ABN , Publish Date - May 04 , 2025 | 05:43 AM

పాకిస్థాన్‌ ఓ విఫల దేశమని, భారత్‌ను శాంతిగా ఉండనివ్వదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. పాకిస్థాన్‌పై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని బిహార్‌లోని సభలో పేర్కొన్నారు.

Asaduddin Owaisi: పాకిస్థాన్‌ ఓ విఫల దేశం

భారత్‌ను ఎప్పటికీ ప్రశాంతంగా ఉండనివ్వదు

కిసాన్‌గంజ్‌, మే 3: పాకిస్థాన్‌ ఓ విఫల దేశమని, భారత్‌ను ఎప్పటికీ ప్రశాంతంగా ఉండనివ్వదని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. పాకిస్థాన్‌పై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బిహార్‌లోని కిసాన్‌గంజ్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన అసదుద్దీన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం వర్గాల్లో శాంతి నెలకొల్పలేని, పొరుగు దేశాలైన ఇరాన్‌, అఫ్ఘానిస్థాన్‌తో సత్సంబంధాలు నెరపలేని పాకిస్థాన్‌ ఓ విఫల దేశమని ఒవైసీ అన్నారు. పాకిస్థాన్‌ కంటే భారత్‌ ఎప్పటికీ బలమైన దేశమేనని పేర్కొన్నారు. భారత్‌లో నివసిస్తున్న ముస్లింలు 1947లోనే జిన్నాను తిరస్కరించారని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి

IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..

Updated Date - May 04 , 2025 | 05:43 AM