Kumbh Mela 2025: మహా కుంభమేళా @60 కోట్లు!
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:46 AM
దేశంలో సనాతన ధర్మం పాటించే 110 కోట్ల మందిలో సగం మందికి పైగా (55%) స్నానాలు చేశారని తెలిపింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 26తో కొనసాగనుంది.

ప్రయాగ్‌రాజ్‌కు భక్తుల పోటు .. 26నాటికి ఈ సంఖ్య 65కోట్లు దాటే అవకాశం
మహాకుంభ్‌నగర్, ఫిబ్రవరి 22: ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమం వద్ద మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు చేసిన భక్తుల సంఖ్య 60 కోట్లు దాటిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. దేశంలో సనాతన ధర్మం పాటించే 110 కోట్ల మందిలో సగం మందికి పైగా (55ు) స్నానాలు చేశారని తెలిపింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 26తో కొనసాగనుంది. 26న జరిగే చివరి అమృత్ స్నానాల నాటికి ఈ సంఖ్య 65కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు యూపీ ప్రభుత్వం వివరించింది. ఒక్క నేపాల్ నుంచే 50 లక్షల మందికి పైగా వచ్చి నదిలో స్నానం చేశారని పేర్కొంది. ఇదిలాఉండగా, మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు చేస్తున్న మహిళా భక్తుల వీడియోలను పోస్టు చేసిన వివిధ సోషల్ మీడియా ఖాతాలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళల ఫొటోలు, వీడియోల ప్రచురణపై అలహాబాద్ హైకోర్టు 2019లో నిషేధం విధించింది.
ఈ నేపథ్యంలో యూపీ పోలీసులకు చెందిన సాంకేతిక నిపుణుల బృందం ఇటువంటి ఖాతాలపై 24 గంటలూ నిఘా పెట్టి, కేసులు నమోదు చేస్తోంది. కొత్వాలి పోలీసు స్టేషన్‌లో ఇప్పటికే 17 ఖాతాలపై 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇలాంటి వీడియోలు విక్రయిస్తున్న ముగ్గురిని అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, మహా కుంభమేళాలో స్నానాలు చేయాలని భావించే ఖైదీల కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 75 జైళ్లలో ఉన్న దాదాపు 90 వేల మందికి పైగా ఖైదీలకు సంగమ జలాలతో స్నానం చేసే అవకాశం కల్పించింది. లఖ్‌నవూ, అయోధ్య, అలీగఢ్‌లో ఉన్న జైళ్లకు త్రివేణీ సంగమం నుంచి పవిత్ర జలాలను అధికారులు తీసుకొచ్చి జైళ్లలోని ట్యాంకర్లలో కలిపారు. అనంతరం ఖైదీలంతా అక్కడే పవిత్ర స్నానాలు అచరించారు.
ఇవి కూడా చదవండి..
Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..
Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు
Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.