Share News

PM Modi: వస్త్ర ఎగుమతులను రూ.9 లక్షల కోట్లకు పెంచడమే మా లక్ష్యం: ప్రధాని మోదీ

ABN , Publish Date - Feb 16 , 2025 | 09:31 PM

ప్రపంచంలో టెక్స్‌టైల్ ఎగుమతిదారుల్లో భారత్ ఆరో స్థానానికి చేరడం ఎంతో గొప్ప విషయం అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన భారత్ టెక్స్- 2025 కు మోదీ హాజరయ్యారు. భారత్ టెక్స్ ఇప్పుడు ఒక మెగా గ్లోబల్ టెక్స్‌టైల్ ఈవెంట్‌గా మారిందన్నారు.

PM Modi: వస్త్ర ఎగుమతులను రూ.9 లక్షల కోట్లకు పెంచడమే మా లక్ష్యం: ప్రధాని మోదీ
PM Modi

ప్రపంచంలో టెక్స్‌టైల్ ఎగుమతిదారుల్లో భారత్ ఆరో స్థానానికి చేరడం ఎంతో గొప్ప విషయం అని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు. ఆదివారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన భారత్ టెక్స్- 2025 కు మోదీ హాజరయ్యారు. భారత్ టెక్స్ ఇప్పుడు ఒక మెగా గ్లోబల్ టెక్స్‌టైల్ ఈవెంట్‌గా మారిందన్నారు. 2030 నాటికి వస్త్ర ఎగుమతలను రూ.9 లక్షల కోట్లకు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని మోదీ స్పష్టం చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2030 కంటే ముందు ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు (Bharat Tex 2025).


``భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో ఆరవ అతిపెద్ద వస్త్ర ఎగుమతిదారుగా ఉంది. 2030 నాటికి వస్త్ర ఎగుమతులను ప్రస్తుత రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.9 లక్షల కోట్లకు పెంచడమే మా లక్ష్యం. వస్త్ర రంగంలో భారతదేశం తన ఉనికిని చాటుకుంటోంది. భారతదేశం అధిక-గ్రేడ్ కార్బన్ ఫైబర్ తయారీ వైపు పయనిస్తోంది. వస్త్ర రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను తయారు చేవడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. వస్త్ర రంగం గతేడాది 7 శాతం వృద్ధిని నమోదు చేసింద``ని మోదీ కొనియాడారు.


``మా ప్రభుత్వం సాంకేతిక వస్త్ర రంగంపై దృష్టి సారించింది. టెక్స్‌టైల్ రంగానికి బ్యాంకులు సహాయ సహకారాలు అందించాలి. టెక్స్‌టైల్ రంగం మరింత అభివృద్ధి చెంది ఎక్కువ మందికి ఉపాధి కల్పించాల``ని ప్రధాని మోదీ సూచించారు. ఢిల్లీలో జరుగుతున్న ఈ భారత్ టెక్స్-2025 కార్యక్రమం ఫిబ్రవరి 14 నుంచి 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో 120కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 16 , 2025 | 09:31 PM