Operation Kagar: దూకుడుగా ఆపరేషన్ కగార్.. మరో రెండు రోజుల్లో
ABN , Publish Date - Apr 26 , 2025 | 03:55 PM
Operation Kagar: గత ఐదు రోజులుగా కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న భద్రతా బలగాలు దాదాపు ఐదారు కిలోమీటర్ల మేర లోపలకు చొచ్చుకుని వెళ్లి మరీ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపిస్తూ భద్రతాబలగాలు దూసుకెళ్తున్నాయి.
ఛత్తీస్‌గఢ్, ఏప్రిల్ 26: తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ (Operation Kagar) కొనసాగుతోంది. మావోయిస్ట్ గెరిల్లా సుప్రీం కమాండర్ హిడ్మా టార్గెట్‌గా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. కర్రెగుట్టల్లో బంకర్‌లో సాయుధదళంతో హిడ్మా ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. హిడ్మా వేటలో నాలుగు హెలికాప్టర్లు, 20 మానవ రహిత వైమానిక వాహనాలు, యూఏవీలు, రెండు డ్రోన్ స్వాడ్రన్‌లు, ఎన్‌టీఆర్‌వో శాటిలైట్ చిత్రాలు, మ్యాప్స్‌తో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. రాయపూర్ జగధల్‌పూర్ నుంచి ఈ ఆపరేషన్‌ను సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జీపీ సింగ్ పర్యవేక్షిస్తుండగా... వార్‌జోన్‌లో బస్తర్ ఐజీ సుందర్ రాజ్ మానిటర్ చేస్తున్నారు.
గత ఐదు రోజులుగా కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న భద్రతా బలగాలు దాదాపు ఐదారు కిలోమీటర్ల మేర లోపలకు చొచ్చుకుని వెళ్లి మరీ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపిస్తూ భద్రతాబలగాలు దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఈరోజు (శనివారం) కర్రెగట్టల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 38 మంది మావోయిస్టుల చనిపోయినట్లు సమాచారం. అయితే దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అధునాతమైన డ్రోన్ల ద్వారా మావోయిస్టుల కదలికలను గుర్తించారు భద్రతాబలగాలు. మావోయిస్టుల కదలికలపై ఫిబ్రవరిలో తీసిన డ్రోన్ విజువల్స్‌ను బయటకు వచ్చాయి. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు కర్రెగుట్టల్లో ఎక్కుతున్న డ్రోన్ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. దీంతో మావోయిస్టులు పెద్దఎత్తున కర్రెగట్టల్లో తలదాచుకున్నట్లు ఈ డ్రోన్ దృశ్యాల ద్వారా స్పష్టమవుతోంది. భారీ ఎత్తున బంకర్లను ఏర్పాటు చేసుకుని అందులోనే మావోయిస్టు రాష్ట్ర ఇన్‌చార్జ్ దామోదర్, హిడ్మా సహా తెలంగాణ క్యాడర్ అంతా కూడా కర్రెగుట్టల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
AP NEWS: లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్
అయితే కర్రెగుట్టలు ఆపరేషన్‌ను నిలిపివేయాలని గత పదిరోజులుగా పౌరహక్కు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా మావోయిస్టు పార్టీ నుంచి కూడా మూడు సార్లు లేఖలు విడుదలయ్యాయి. శాంతి చర్చలకు సిద్ధమంటూ లేఖలు విడుదల చేశారు. దీంతో శాంతిచర్చలకు కేంద్రం ముందుకు రావాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరి డిమాండ్లను పట్టించుకోకుండా భద్రతా బలగాలు ముందుకు దూసుకెళ్తున్నాయి. మావోయిస్టులను తుదముట్టించేందుకు పూర్తిస్థాయిలో భద్రతా బలగాలు కర్రెగట్టల్లో సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ఆదివాసీ గుడాల్లో కూడా బాంబుల శబ్దాలు వినిపిస్తున్నాయంటూ అక్కడి ప్రజలు అడవులను విడిచి భయటకు వస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఆదివాసీలు కూడా ప్రాణాలు కోల్పోతున్నట్లు సమాచారం.
ఈ ఆపరేషన్‌లో మావోయిస్టులే కాకుండా ఆదివాసీలు ప్రాణాలు కోల్పోతున్నారని పౌరహక్కు సంఘాల నేతలు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం శాంతి చర్చలకు ముందుకు రావాలని, అందుకు ఒక నెలరోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించాలని పౌరహక్కు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అయితే వీళ్ల డిమాండ్‌లను పట్టించుకోకుండా భద్రతా బలగాలు ముందుకు దూసుకెళ్తున్నారు. ఆపరేషన్ కగార్ చివరి అంకానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లోనే ఆపరేషన్ పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
BRS Vs Congress: మీ మౌనం దేనికి సంకేతం.. రాహుల్‌కు కవిత సూటి ప్రశ్న
Pahalgam Terror Attack: అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం
Read Latest Telangana News And Telugu News