Share News

Air India Plane Crash: విమాన ప్రమాదంపై ఇప్పుడే ఏ నిర్ణయానికి రావొద్దు... కేంద్ర మంత్రి

ABN , Publish Date - Jul 12 , 2025 | 03:39 PM

ఏఏఐబీ ప్రాథమిక నివేదిక ప్రకారం.. విమానం టేకాఫ్ అయిన సెకన్ల వ్యవధిలోనే ఇంధన కంట్రోల్ స్విచ్‌లు అగిపోయాయి. స్విచ్ ఎందుకు ఆపు చేశావని ఒక పైలట్ ప్రశ్నించగా, తాను స్విచ్ఛాఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానమిచ్చాడు.

Air India Plane Crash: విమాన ప్రమాదంపై ఇప్పుడే ఏ నిర్ణయానికి రావొద్దు... కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమానం గత నెలలో కూలిపోవడంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఇచ్చిన నివేదికపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) శనివారంనాడు స్పందించారు. ప్రాథమిక ఆధారాలను పరిగణనలోకి తీసుకుని ఏఏఐబీ నివేదిక ఇచ్చిందని, దీనిని బట్టి విమాన ప్రమాదంపై అప్పుడే ఒక నిర్ణయానికి రాకూడదని చెప్పారు. తుది నివేదిక వచ్చేంత వరకూ వేచిచూడాలని సూచించారు.


'విమాన ప్రమాదంపై అప్పుడే ఒక తుది నిర్ణయానికి రాకూడదు. ప్రపంచంలోనే అత్యంత సమర్ధత కలిగిన పైలట్లు మనకు ఉన్నారు. పైలట్లు, సిబ్బంది కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పౌర విమానయానానికి వారు వెన్నెముక వంటివారు. ఈ రంగానికి వారే ప్రధాన వనరులు. వారి సంక్షేమం, శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం పనిచేస్తోంది. ఆ దృష్ట్యా ఇప్పుడే నివేదకపై తుది నిర్ణయానికి రాకూడదు. తుది నివేదిక కోసం వేచిచూద్దాం. ఇందులో కొన్ని సాంకేతిక అంశాలు కూడా ముడపడి ఉన్నాయి' అని రామ్మోహన్ నాయుడు అన్నారు.


ఏఏఐబీ ప్రాథమిక నివేదిక ప్రకారం.. విమానం టేకాఫ్ అయిన సెకన్ల వ్యవధిలోనే ఇంధన కంట్రోల్ స్విచ్‌లు అగిపోయాయి. స్విచ్ ఎందుకు ఆపు చేశావని ఒక పైలట్ ప్రశ్నించగా, తాను స్విచ్ఛాఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానమిచ్చాడు. ఆ తర్వాత పైలట్లు మేడే కాల్ ఇవ్వగా, ఎందుకు మేడే కాల్ ఇచ్చారో తెలుసుకునేందుకు 'ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్' ప్రయత్నించింది. పైలట్ల నుండి ఎలాంటి స్పందనా రాలేదు. కొద్దిసేపటికే విమానం కుప్పకూలింది.


ఇవి కూడా చదవండి..

విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు

కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 12 , 2025 | 03:45 PM