Share News

Punjab Village: ఇది అవినీతికే పరాకాష్ట.. రాష్ట్రంలో లేని గ్రామం అభివృద్ధి కోసం రూ.43 లక్షల ఖర్చు..

ABN , Publish Date - Jan 23 , 2025 | 09:09 PM

పంజాబ్‌లోని అధికారులు అవినీతి చేయడంలో మాస్టర్ డిగ్రీ చేశారు. ఊహా లోకంలో ఓ గ్రామం సృష్టించి దాని అభివృద్ధి కోసం అని చెప్పి ఏకంగా రూ.43 లక్షలు కాజేశారు. ఆ గ్రామం పేపర్లపై తప్ప ఈ భూమి మీద లేదు. గూగుల్ మ్యాప్స్‌కు కూడా ఆ గ్రామం ఆచూకీ దొరకలేదు.

Punjab Village: ఇది అవినీతికే పరాకాష్ట.. రాష్ట్రంలో లేని గ్రామం అభివృద్ధి కోసం రూ.43 లక్షల ఖర్చు..
Imaginary village in Punjab

గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల రూపాయల గ్రాంట్‌లను విడుదల చేస్తుంటాయి. వాటిల్లో కొందరు స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లు లంచాలు తీసుకుని మిగిలిన డబ్బుతో పనులు చేయిస్తుంటారు. అయితే పంజాబ్‌ (Punjab)లోని అధికారులు ఇలా అవినీతి చేయడంలో మాస్టర్ డిగ్రీ చేశారు. ఊహా లోకంలో ఓ గ్రామం సృష్టించి దాని అభివృద్ధి కోసం అని చెప్పి ఏకంగా రూ.43 లక్షలు కాజేశారు. ఆ గ్రామం పేపర్లపై తప్ప ఈ భూమి మీద లేదు. గూగుల్ మ్యాప్స్‌కు కూడా ఆ గ్రామం ఆచూకీ దొరకలేదు. ఆర్టీఐ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది (Imaginary village in Punjab).


పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు సమీపంలో ``గట్టీ రాజో కి`` (Gatti Rajo Ki) అని గ్రామ పంచాయితీ ఉన్నట్టు అధికారులు సృష్టించారు. ఆ మేరకు ఆ గ్రామం పేరు మీద పేపర్లు తయారు చేశారు. ఆ గ్రామ అభివృద్ధి కోసం అని చెప్పి పలు దఫాలుగా రూ.43 లక్షలు విడుదల చేసి కాజేశారు. ఈ నకిలీ గ్రామానికి 140 జాబ్ కార్డులను కూడా తయారు చేశారు. ఈ నకిలీ గ్రామంలో 55 అభివృద్ధి పనులు జరిగినట్టు దస్త్రాలు సృష్టించారు. ఆ ఊహా జనిత గ్రామంలో ఆర్మీ డ్యామ్, జంతువుల షెడ్, స్కూల్ పార్క్, రోడ్లు, ఇంటర్‌లాక్ టైల్స్ శుభ్రపరచడం మొదలైన పనులు చేసినట్టు పేర్కొన్నారు.


ఈ స్కామ్‌ను ఆర్టీఐ కార్యకర్త, బ్లాక్ కమిటీ సభ్యుడు గురుదేవ్ సింగ్ బయటపెట్టారు. సుదీర్ఘ పోరాటం తర్వాత పంజాబ్ ప్రభుత్వం నుంచి గట్టి రాజో పంచాయతీకి సంబంధించిన సమాచారం అందిందని గురుదేవ్ తెలిపారు. ఈ కుంభకోణం గురించి పంచాయతీ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. దీంతో ఈ అంశంపై ఫిరోజ్‌పూర్ డిప్యూటీ కమిషనర్ దీప్శిఖా శర్మకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆ నివేదికను పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 23 , 2025 | 09:09 PM