ICU incident: ఐసీయూలో మహిళా రోగిపై అత్యాచారం
ABN , Publish Date - Jun 08 , 2025 | 05:53 AM
జూన్ 4వ తేదీన అల్వార్‌లోని ఈఎ్‌సఐసీ మెడికల్ కాలేజీలో ఈ ఘోరం జరిగింది. అత్యాచారానికి ముందు.. బాధితురాలికి నిందితుడు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆమెపై దారుణం జరుగుతుండగా కుటుంబసభ్యులు వార్డు బయటే ఉన్నారు.
జైపూర్, జూన్ 7: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న 32 ఏళ్ల మహిళపై అక్కడి నర్సింగ్ సిబ్బందిలో ఒకడు అత్యాచారానికి ఒడిగట్టాడు. జూన్ 4వ తేదీన అల్వార్‌లోని ఈఎ్‌సఐసీ మెడికల్ కాలేజీలో ఈ ఘోరం జరిగింది. అత్యాచారానికి ముందు.. బాధితురాలికి నిందితుడు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆమెపై దారుణం జరుగుతుండగా కుటుంబసభ్యులు వార్డు బయటే ఉన్నారు. ఘోరాన్ని పసిగట్టి తీవ్రంగా ప్రతిఘటించిన బాధితురాలు తన కుటుంబసభ్యులను పిలుస్తూ కేకలు పెట్టింది. ఆమె భర్త కంగారుపడుతూ లోపలికి వెళ్లాడు. తనపై జరిగిన ఘోరం గురించి భర్తకు చెబుతూనే బాధితురాలు పూర్తిగా మత్తులోకి జారుకుంది.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..