Meerut Nude Gang: మీరట్‌లో న్యూడ్ గ్యాంగ్ అరాచకాలు
ABN , Publish Date - Sep 07 , 2025 | 05:44 AM
ఎలాంటి దుస్తులు ధరించకుండా నగ్నంగా తిరిగే పురుషులు కొందరు ‘న్యూడ్ గ్యాంగ్’ పేరుతో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ పరిసర ప్రాంతాల్లో...
మీరట్, సెప్టెంబరు 6: ఎలాంటి దుస్తులు ధరించకుండా నగ్నంగా తిరిగే పురుషులు కొందరు ‘న్యూడ్ గ్యాంగ్’ పేరుతో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు. దౌరాలా, భారాల గ్రామాల్లో తిరుగుతూ మహిళలను నిర్మానుష్య ప్రాంతాలకు లాక్కెళ్తున్నట్టు సమాచారం అందింది. ఇంతవరకు నిందితులు ఎవరూ దొరకకపోవడంతో పోలీసులు డ్రోన్లను వినియోగించి గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల భారాల గ్రామంలో ఒంటరిగా నడుచుకొని వెళ్తున్న మహిళను నగ్నంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు పొలాల్లోకి లాక్కెళ్లారు. ఆమె ఎలాగోలాగ తప్పించుకొని ఇంటికి చేరింది. దాంతో గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు ఇలాంటివి మూడు సంఘటనలు జరిగినా సిగ్గుతో అధికారుల దృష్టికి తీసుకెళ్లలేదని తెలిసింది. నిందితుల ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు కీలక ప్రదేశాల్లో సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇది కేవలం వదంతి మాత్రమేనని కొందరు కొట్టిపారేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ముంబైను పేల్చేస్తామన్న వ్యక్తి 24 గంటల్లో అరెస్టు
అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్