Share News

India-Pakistan Ceasefire: కాదు కాదంటూనే సయోధ్య కుదిర్చిన పెద్దన్న

ABN , Publish Date - May 10 , 2025 | 07:11 PM

కాల్పుల విరమించామంటూ భారత్-పాక్ ధ్రువీకరించడానికి కొద్ది ముందే ..ఇరుదేశాల మధ్య సయోధ్య కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత్, పాక్ దేశాల మధ్య రాత్రంత్రా జరిపిన మధ్యవర్తిత్వం ఫలించిందని, యుద్ధ విరమణకు భారత్, పాక్ అంగీకరించినందుకు సంతోషంగా ఉందని ట్రంప్ అన్నారు.

India-Pakistan Ceasefire: కాదు కాదంటూనే సయోధ్య కుదిర్చిన పెద్దన్న

న్యూఢిల్లీ: 'ఆపరేషన్ సింధూర్'పై పాక్ ఉగ్రస్థావరాలను భారత్ నేలమట్టం చేపట్టినప్పటి నుంచి నాలుగు రోజులుగా భారత్-పాక్ మధ్య తారాస్థాయికి చేరిన ఉద్రిక్తతలకు శనివారం సాయంత్రం 5 గంటలకు తెరపడింది. మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ డీజీఎంవో నుంచి భారత్ డీజీఎంఓకు ఫోన్ రావడం, కాల్పుల విరమణపై ఇరుదేశాల డీజీఎంఓల మధ్య జరగడం, చర్చల అనంతరం అనంతరం కాల్పుల విరమణకు ఇరుదేశాలు అంగీకరించడం చకచగా జరిగాయి. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఇరుదేశాల విదేశాంగ శాఖ ప్రతినిధులు వేర్వేరు ప్రకటనల్లో కాల్పుల విరమణను ధ్రువీకరించారు.

పూర్వరంగం..

కాల్పుల విరమించామంటూ భారత్-పాక్ ధ్రువీకరించడానికి కొద్ది ముందే ..ఇరుదేశాల మధ్య సయోధ్య కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత్, పాక్ దేశాల మధ్య రాత్రంత్రా జరిపిన మధ్యవర్తిత్వం ఫలించిందని, యుద్ధ విరమణకు భారత్, పాక్ అంగీకరించినందుకు సంతోషంగా ఉందని ట్రంప్ అన్నారు.

మా పని కాదంటూనే...

కాగా, దీనికి కొద్ది గంటల ముందే భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ రెండు దేశాల నడుమ జరిగే యుద్ధంలో తాము జోక్యం చేసుకోమంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తేల్చిచెప్పడం ఆసక్తికరం. ప్రాథమికంగా అయితే ఇరుదేశాల మధ్య యుద్ధం తమకు సంబంధం లేదని విషయమని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్ పేర్కొన్నారు. అణ్వాయుధ దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించేందుకు మాత్రం ప్రోత్సహిస్తామన్నారు. ''ఆయుధాలు వదిలేయాలని భారత్, పాక్‌కు మేం చెప్పలేం. మేము దౌత్య మార్గాల ద్వారా ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నిస్తాం'' అని చెప్పారు. ఈ క్రమంలోనే ఏ ఉగ్రదాడినైనా ఇక నుంచి యుద్ధంగా పరగణిస్తాంటూ భారత్ శుక్రవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. పాక్‌కు పరోక్షంగా తీవ్ర హెచ్చరికలు చేసింది. దీంతో రాయబారం కోసం అమెరికాను పాక్ వేడుకోవడం, ట్రంప్ దౌత్యం ఫలించి కాల్పుల విరమణకు భారత్ అంగీకరించడంతో ఆయన తక్షణమే ఇరుదేశాల అంగీకారంపై కీలక ప్రకటన చేశారు. భారత్-పాక్‌ ఎంతో వివేకంగా వ్యహరించాయని, కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ప్రశంసలు కురిపించారు.

Updated Date - May 10 , 2025 | 08:33 PM