Nirmala Sitharaman: పదేళ్లలో రూ.16.35 లక్షల కోట్లు
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:27 AM
అత్యల్పంగా రూ.58,786 కోట్లను 2014-15 సంవత్సరంలో రైటాఫ్ చేసినట్టు పేర్కొంది. 2023-24లో రూ.1,70,270 కోట్లు, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో రూ.2,16,324 కోట్లను బ్యాంకులు రైటాఫ్ చేసినట్టు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
బ్యాంకులు రైటాఫ్ చేసిన మొత్తమిది
లోక్‌సభలో నిర్మలా సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ, మార్చి 17: గత పది ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు రూ.16.35 లక్షల కోట్ల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏలు) లేదా మొండి బాకీలను బ్యాంకులు రైటాఫ్ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌కు తెలియజేసింది. ఇందులో అత్యధికంగా రూ.2,36,265 కోట్లను 2018-19 సంవత్సరంలో.. అత్యల్పంగా రూ.58,786 కోట్లను 2014-15 సంవత్సరంలో రైటాఫ్ చేసినట్టు పేర్కొంది. 2023-24లో రూ.1,70,270 కోట్లు, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో రూ.2,16,324 కోట్లను బ్యాంకులు రైటాఫ్ చేసినట్టు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మార్గదర్శకాలు, బ్యాంకుల బోర్డులు ఆమోదించిన విధానం ప్రకారం బ్యాంకులు మొండి పద్దులను రైటాఫ్ చేస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి రైటా్‌ఫల వల్ల రుణగ్రహీతల రుణాలు మాఫీ కావు కాబట్టి వారికి ప్రయోజనం కలగదని తెలిపారు. బ్యాంకులు వాటికి అందుబాటులో ఉన్న వివిధ రికవరీ యంత్రాంగాల ద్వారా రుణగ్రహీతలపై రికవరీ చర్యలు చేపడతాయని చెప్పారు. సివిల్ కోర్టులు లేదా డెట్ రికవరీ ట్రైబ్యునళ్లు వంటి వాటిలో దావా వేయడంతోపాటు సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవడం, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో కేసులను దాఖలు చేయడం వంటివి చేస్తాయన్నారు.
ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. 2024 డిసెంబరు 31 వరకు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఎన్‌పీఏలుగా వ ర్గీకరించిన 20 ప్రత్యేక రుణగ్రహీత కంపెనీలున్నాయని, వాటిలో ప్రతి ఒక్కటి రూ.1,000 కోట్లు అంతకుమించి బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఈ ఖాతాల మొత్తం బకాయిలు రూ.61,027 కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. రుణగ్రహీతలు బకాయి పడిన మొత్తాన్ని రికవరీ చేయడానికి బ్యాంకులు కాల్స్ చేయడంతోపాటు ఈమెయిల్స్/లేఖలు పంపుతాయని పేర్కొన్నారు. డిఫాల్ట్ మొత్తాన్ని బట్టి కార్పొరేట్ రుణగ్రహీతల విషయంలో కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించడానికి గాను బ్యాంకులు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించవచ్చని తెలిపారు. రుణ ఖాతాను ఎన్‌పీఏగా వర్గీకరించిన సందర్భంలో తమ బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపిన విధానం ప్రకారం బ్యాంకులు రికవరీ చర్యలకు ఉపక్రమిస్తాయని చెప్పారు. కాగా ఎనిమిదో వేతన సంఘం (సీపీసీ) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మరో ప్రశ్నకు సమాధానంగా నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి...
Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం
YSR Kadapa District: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు
PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా
CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..
Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్
CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు
CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్ రూపొందించాం
Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్