Kerala Nurse: నిమిషప్రియ మరణశిక్ష వాయిదా
ABN , Publish Date - Jul 16 , 2025 | 05:42 AM
యెమెన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషప్రియకు ఊరట లభించింది. మరణ శిక్ష అమలును యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసినట్లు భారత విదేశాంగ వర్గాలు..
న్యూఢిల్లీ, జూలై 15: యెమెన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషప్రియకు ఊరట లభించింది. మరణ శిక్ష అమలును యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసినట్లు భారత విదేశాంగ వర్గాలు మంగళవారం వెల్లడించాయి.వాస్తవానికి నిమిషప్రియకు బుధవారం మరణ దండనను అమలు చేయాల్సి ఉండగా.. చివరిక్షణంలో దీన్ని వాయిదా వేసినట్లు తెలిపాయి. హతుడి కుటుంబ సభ్యులతో పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం చేసుకోవడానికి నిమిషప్రియ కుటుంబ సభ్యులకు మరికొంత సమయం ఇవ్వాలంటూ భారత ప్రభుత్వం యెమెన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆ ప్రయత్నాల వల్లే, స్థానిక అధికారులు నిమిషప్రియ మరణ శిక్షను వాయిదా వేసినట్లు వివరించాయి. దీనిపై ఆమె భర్త టామీ థామస్ హర్షం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం, ఇతర సంస్థలు చేసిన ప్రయత్నాల వల్లే ఇది సాధ్యమైందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
ఇక సమోసా, జిలేబీలకూ సిగరెట్ ప్యాకెట్ తరహా హెచ్చరికలు..
మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్‌పై దాడి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి