NIA: పహల్గాం ఉగ్రదాడిని చిత్రీకరించిన వీడియోగ్రాఫర్
ABN , First Publish Date - 2025-04-28T04:44:49+05:30 IST
పహల్గామ్ ఉగ్రదాడిపై జరుగుతున్న దర్యాప్తులో ఎన్‌ఐఏకి కీలక ఆధారం లభించింది. ఒక "రీల్స్ వీడియోగ్రాఫర్" ఆ ఉగ్రదాడిని చిత్రీకరించి, వీడియో ద్వారా నలుగురు ఉగ్రవాదులు రెండు జట్లుగా విడిపోవడం, కాల్పుల శబ్దం, పర్యాటకులపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరపడం స్పష్టమైంది.
చెట్టు పై నక్కి రికార్డింగ్
జమ్మూ, ఏప్రిల్ 27: పహల్గాంలోని బైసారన్‌లో జరిగిన ఉగ్రదాడిపై విచారణ జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు కీలక ఆధారం లభించింది. నలుగురు ఉగ్రవాదులు రెండు జట్లుగా విడిపోయి, చేసిన మారణకాండను ఓ ‘రీల్స్ వీడియోగ్రాఫర్’ సాంతం చిత్రీకరించారు. తూటాల శబ్దం వినబడగానే ఆ వీడియోగ్రాఫర్ తొలుత ప్రాణభయంతో చెట్టుపైకెక్కారు. అక్కడే నక్కి ఉగ్రదాడిని చిత్రీకరించారు. ఇప్పుడు ఎన్‌ఐఏ దర్యాప్తులో ఈ వీడియో కీలకమైన సాక్ష్యంగా మారింది. ఉగ్రవాదులకు స్థానికంగా సహకరించిందెవరు? అనే అంశంపైనా ఓ స్పష్టత వస్తుందని ఎన్‌ఐఏ భావిస్తోంది. వీడియోలో ఉన్నదాన్ని బట్టి.. ‘‘నలుగురు ఉగ్రవాదులు రెండుగా విడిపోయారు. తొలుత ఇద్దరు బైసారన్ లోయ వైపు పర్యాటకుల వద్దకు వచ్చి, కాల్పులు మొదలు పెట్టారు. నలుగురు పర్యాటకుల తలలపై అతి సమీపం నుంచి(పాయింట్ బ్లాంక్ రేంజ్) కాల్పులు జరిపారు. ఆ శబ్దం రాగానే, ఓ దుకాణం వెనక నక్కిన మిగతా ఇద్దరు ఉగ్రవాదులు మరోవైపు నుంచి పర్యాటకుల వైపు కదిలారు’’ అని ఓ దర్యాప్తు అధికారి వివరించారు.
ఇవి కూడా చదవండి:
Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా
Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News