IT Bill: అనుమానం వస్తే చాలు.. ఆన్‌లైన్ అంతా జల్లెడ!
ABN , Publish Date - Mar 05 , 2025 | 02:31 AM
కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదించిన కొత్త ఐటీ బిల్లు ఇందుకు అధికారం కల్పిస్తోంది. లెక్కల్లో చూపించని నగదు, నగలు, ఇతర విలువైన వస్తువులు, పత్రాలు మీ దగ్గర ఉన్నట్లు భావించినా కూడా అధికారులు వీటన్నింటినీ తనిఖీ చేసేలా ఈ బిల్లు విస్తృత అధికారాలను కట్టబెడుతోంది.

ఐటీ అధికారులకు విస్తృత అధికారాలు
సోషల్, ట్రేడింగ్, ఇన్వె్‌స్టమెంట్, ఈమెయిల్
ఏ ఖాతాలనైనా తనిఖీ చేసేందుకు పవర్
కొత్త ఐటీ బిల్లులో ఈ మేరకు నిబంధనలు
పార్లమెంటు ఆమోదిస్తే వచ్చే ఏడాది అమలు
ఐటీ ఎగ్గొట్టారని అనుమానం వస్తే చాలు..
న్యూఢిల్లీ, మార్చి 4: మీరు ఆదాయపు పన్ను(ఐటీ)ను ఎగ్గొడుతున్నారన్న అనుమానం వస్తే చాలు.. ఐటీ అధికారులు మీ సోషల్ మీడియా ఖాతాలను, వ్యక్తిగత మెయిళ్లను, బ్యాంక్ అకౌంట్లను, ఆన్‌లైన్ ఇన్వె్‌స్టమెంట్, ట్రేడింగ్ ఖాతాలను తనిఖీ చేయవచ్చు. కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదించిన కొత్త ఐటీ బిల్లు ఇందుకు అధికారం కల్పిస్తోంది. లెక్కల్లో చూపించని నగదు, నగలు, ఇతర విలువైన వస్తువులు, పత్రాలు మీ దగ్గర ఉన్నట్లు భావించినా కూడా అధికారులు వీటన్నింటినీ తనిఖీ చేసేలా ఈ బిల్లు విస్తృత అధికారాలను కట్టబెడుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఐటీ చట్టం-1961 ప్రకారం.. ఎవరైనా పన్ను ఎగవేస్తున్నారన్న అనుమానం, సమాచారం ఉంటే వారి ఇండ్లు, ఆఫీసులు, లాకర్లు, అల్మారాల తాళాలు పగలగొట్టి సోదాలు నిర్వహించేందుకు మాత్రమే ఐటీ అధికారులకు అధికారం ఉంది. కానీ, కొత్తగా తీసుకురానున్న చట్టంలో ‘వర్చువల్ డిజిటల్ స్పేస్’ను కూడా తనిఖీ చేయవచ్చని పేర్కొన్నారు.
ఐటీ బిల్లులోని 247వ క్లాజులో వర్చువల్ డిజిటల్ స్పేస్ కిందకు ఏమేం వస్తాయన్నదానిపై వివరణ ఇస్తూ.. ఈ మెయిళ్లు, ట్రేడింగ్ ఖాతాలు, సోషల్ మీడియా అకౌంట్లను, క్లౌడ్ సర్వర్లను ఆ జాబితాలో చేర్చారు. అయితే, ఈ నిబంధనలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. వీటి వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందన్న వాదనలున్నాయి. కొత్త ఐటీ బిల్లును ఫిబ్రవరి 7న కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది. పార్లమెంటు ఆమోదించి రాష్ట్రపతి సంతకం చేస్తే ఆ బిల్లు చట్టంగా మారి వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.
ఇవి కూడా చదవండి
PM Modi: సింహం పిల్లలకు మోదీ ఫీడింగ్.. వీడియో వైరల్
Aurangazeb Row: ఔరంగజేబు వ్యాఖ్యల వివాదంపై అబూ అజ్మి క్షమాపణ
Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు
Bird flu: బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..
Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.