Delhi politics: మోదీ అమెరికా నుంచి వచ్చాకే ఢిల్లీలో కొత్త ప్రభుత్వం!
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:18 AM
ఈ నెల 12, 13 తేదీల్లో ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. 15వ తేదీన తిరిగిరానున్నారు. ఆ తర్వాతే నూతన ప్రభుత్వం ఏర్పడుతుందని బీజేపీ వర్గాలు చెప్పాయి.

షాతో నడ్డా సమావేశం, సీఎం అభ్యర్థిపై చర్చ
రేసులో ముందున్న పర్వేశ్ వర్మ
ముఖ్యమంత్రి పదవికి అతిశీ రాజీనామా
ఆప్ ఎమ్మెల్యేలతో అరవింద్ కేజ్రీవాల్ భేటీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి9: ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం కానుంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగించుకుని వచ్చాకే కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 12, 13 తేదీల్లో ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. 15వ తేదీన తిరిగిరానున్నారు. ఆ తర్వాతే నూతన ప్రభుత్వం ఏర్పడుతుందని బీజేపీ వర్గాలు చెప్పాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. సీఎం అభ్యర్ధిపై చర్చించినట్లు సమాచారం. రేసులో పర్వేశ్ వర్మ ముందున్నా పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఎంపీ బాన్సురి స్వరాజ్, మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయంతో సీఎం పదవికి అతిశీ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు అందజేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 22 మంది ఎమ్మెల్యేలతో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఫిరోద్ షా రోడ్డులోని తన నివాసంలో భేటీ అయ్యారు. ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
Delhi: ముంచుకొస్తున్న మరో ఎన్నిక, ఇక పార్టీల ఫోకస్ దానిపైనే..
Delhi CM: ఢిల్లీ సీఎం అతిషి రాజీనామా.. అసెంబ్లీ రద్దు
Delhi CM: ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఢిల్లీని బీజేపీ పాలించినపుడు ఏం జరిగిందంటే..
For More National News and Telugu News..