Share News

Aadhaar update: త్వరలో అందుబాటులోకి కొత్త ఆధార్‌

ABN , Publish Date - Nov 20 , 2025 | 04:24 AM

ఆధార్‌ కార్డుదారుని ఫొటో, క్యూఆర్‌ కోడ్‌ మాత్రమే ఉండేలా ఆధార్‌ కార్డును రూపొందించాలన్న ఆలోచన చేస్తున్నాం. ఇది కార్డుదారుని వ్యక్తి సమాచార దుర్వినియోగాన్ని అరికడుతుంది...

Aadhaar update: త్వరలో అందుబాటులోకి కొత్త ఆధార్‌

  • కార్డుపై ఫొటో, క్యూఆర్‌ కోడ్‌ మాత్రమే.. అడ్రస్‌ మార్పు ఇక ఈజీ

  • ఆన్‌లైన్‌ సమావేశంలో ఉడాయ్‌ సీఈవో భువనేశ్‌ కుమార్‌

న్యూఢిల్లీ, నవంబరు 19: ‘ఆధార్‌ కార్డుదారుని ఫొటో, క్యూఆర్‌ కోడ్‌ మాత్రమే ఉండేలా ఆధార్‌ కార్డును రూపొందించాలన్న ఆలోచన చేస్తున్నాం. ఇది కార్డుదారుని వ్యక్తి సమాచార దుర్వినియోగాన్ని అరికడుతుంది. ప్రస్తుత చట్టాలకు విరుద్ధంగా అనుసరిస్తున్న ఆఫ్‌లైన్‌ ధ్రువీకరణ పద్ధతులను నిరుత్సాహపరుస్తుంది’ అని ఉడాయ్‌ సీఈఓ భువనేశ్‌ కుమార్‌ తెలిపారు. మరో 18 నెలల్లో పూర్తిగా అమలులోకి వచ్చే వ్యక్తిగత డిజిటల్‌ సమాచార రక్షణ చట్టానికి అనుగుణంగా త్వరలోనే ఉడాయ్‌ కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు, హోటళ్లు, ఫిన్‌టెక్‌ వంటి పలు భాగస్వామ్య సంస్థలతో ఉడాయ్‌ ఒక సమావేశాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించింది.

ఈ సమావేశంఓ సీఈఓ మాట్లాడారు. ‘‘డిసెంబరులో కొత్త నిబంధనను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. కార్డు మీద ఏ వివరాలైనా ఎందుకు ఉండాలి? అన్నది ఒక ఆలోచన. దానిలో భాగంగానే కార్డుపై ఫొటో, క్యూఆర్‌ కోడ్‌. దుర్వినియోగం చేయాలనుకునే వాళ్లు దేనినైనా చేస్తూనే ఉంటారు. ఆఫ్‌లైన్‌ ధ్రువీకరణ పద్ధతిలో ఆధార్‌ నంబరును, బయోమెట్రిక్‌ వివరాలను అట్టిపెట్టుకోవడాన్ని ఆధార్‌ చట్టం నిరోధిస్తుంది. అయినప్పటికీ అనేక సంస్థలు ఆధార్‌ కార్డు ఫొటో కాపీని దాచిపెట్టుకుంటూనే ఉన్నాయి.

ఫోన్‌ నంబరు మార్పులు..

అయితే డిసెంబరు 1నుంచి ఆఫ్‌లైన్‌ వెరిఫికేషన్‌ పద్ధతులను నిరోధించే దిశగా ఉడాయ్‌ పనిచేస్తుంది. ఆధార్‌ని ఒక డాక్యుమెంటులా ఉపయోగంచడం కుదరదు. ధ్రువీకరణను క్యూఆర్‌ కోడ్‌తో కానీ, ఆధార్‌ నంబరుతో కానీ చేయాలి. ఉడాయ్‌ తీసుకువస్తున్న ఈ కొత్త యాప్‌తో చిరునామా, ఫోన్‌ నంబరు మార్పులు చేర్పులను స్వయంగా చేసుకోవచ్చు. ఈ యాప్‌లోని ఫేస్‌ అథెంటికేషన్‌ ఫీచర్‌ దీనిని సులభతరం చేస్తుంది. ఎం ఆధార్‌ యాప్‌ స్థానంలో వచ్చే ఈ సరొకొత్త యాప్‌ వివిధ ప్రాంతాల్లో, అవసరాల్లో అథెంటికేషన్‌, వయస్సు ధ్రువీకరణ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది’’ అని భువనేశ్‌ వివరించారు.

ఇవీ చదవండి:

హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు

అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ

Updated Date - Nov 20 , 2025 | 06:46 AM