Share News

Govt Hospital: చిన్నారి మృతి.. నేలపై పడి వెక్కి వెక్కి ఏడ్చిన తండ్రి..

ABN , Publish Date - Jun 19 , 2025 | 09:09 PM

Govt Hospital: అక్కడి డాక్టర్లు కానీ, సిబ్బంది కానీ బాలుడ్ని పట్టించుకోలేదు. వైద్యం చేయలేదు. కొద్దిసేపటికే బాలుడు చనిపోయాడు. దీంతో షారుఖ్ గుండె పగిలిపోయింది. కన్నీళ్లు ఆగలేదు. అక్కడి ఫ్లోర్‌పై పడి వెక్కి వెక్కి ఏడ్చాడు.

Govt Hospital: చిన్నారి మృతి.. నేలపై పడి వెక్కి వెక్కి ఏడ్చిన తండ్రి..
Govt Hospital

ఉత్తర ప్రదేశ్‌లోని ఫతేహ్‌పూర్ జిల్లాలో హృదయ విదారక సంఘటన ఒకటి చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి ప్రాణం కోల్పోయాడు. కళ్ల ముందే కన్నబిడ్డ చనిపోవటంతో బాలుడి తండ్రి తట్టుకోలేకపోయాడు. కన్నీరు మున్నీరుగా విలపించాడు. నేలపై పడి వెక్కి వెక్కి ఏడ్చాడు. బుధవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం చెప్పిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, ఫతేహ్‌ఫూర్ జిల్లాలోని లఖీపూర్ గ్రామానికి చెందిన షారుఖ్‌కు ఈ మధ్యే కొడుకు పుట్టాడు.


చిన్నారికి ఆర్యన్ అని పేరు పెట్టాడు. ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటూ ఉన్నాడు. ఏమైందో ఏమో తెలీదు కానీ, బుధవారం మధ్యాహ్నం ఆర్యన్ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో షారుఖ్ తన కొడుకును కంగాలోని హార్దో సీహెచ్‌సీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. దీంతో చిన్నారిని తీసుకుని జిల్లా ఆస్పత్రికి వెళ్లాడు. నేరుగా ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లి అక్కడి డాక్టర్లకు విషయం చెప్పాడు.


అయితే, అక్కడి డాక్టర్లు కానీ, సిబ్బంది కానీ బాలుడ్ని పట్టించుకోలేదు. వైద్యం చేయలేదు. కొద్దిసేపటికే బాలుడు చనిపోయాడు. దీంతో షారుఖ్ గుండె పగిలిపోయింది. కన్నీళ్లు ఆగలేదు. అక్కడి ఫ్లోర్‌పై పడి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ సందర్భంగా షారుఖ్ మాట్లాడుతూ.. ‘10 నిమిషాలు అయింది నా బిడ్డకు ఆక్సిజన్ పెట్టలేదు. నా పిల్లాడిని ఇప్పటి వరకు ఎవ్వరూ పట్టించుకోలేదు’ అంటూ కన్నీరుమున్నీరు అయ్యాడు. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.


ఇవి కూడా చదవండి

సార్ మా అమ్మ మర్డర్ కేసు ఛేదించండి.. సీఐడీ నటుడికి ఫ్యాన్ విజ్ణప్తి..

విమాన ప్రమాదం.. కస్టమర్లకు ఎయిర్ ఇండియా సీఈఓ లేఖ..

Updated Date - Jun 19 , 2025 | 09:37 PM