Share News

Air India: విమాన ప్రమాదం.. కస్టమర్లకు ఎయిర్ ఇండియా సీఈఓ లేఖ..

ABN , Publish Date - Jun 19 , 2025 | 07:37 PM

Air India CEO Campbell Wilson: ఏఐ 171 విమాన ప్రమాదంపై ఎయిర్ ఇండియా సంస్థ సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ స్పందించారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా కస్టమర్లకు ఓ లేఖ రాశారు. ప్రయాణికుల భద్రతే తమకు ప్రథమ కర్తవ్యం అని స్పష్టం చేశారు.

Air India: విమాన ప్రమాదం.. కస్టమర్లకు ఎయిర్ ఇండియా సీఈఓ లేఖ..
Air India CEO Campbell Wilson

ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 విమాన ప్రమాదంపై ఆ సంస్థ సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ స్పందించారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా కస్టమర్లకు ఓ లేఖ రాశారు. ప్రయాణికుల భద్రతే తమకు ప్రథమ కర్తవ్యం అని స్పష్టం చేశారు. ఇంకా ఆ లేఖలో.. ‘అహ్మదాబాద్ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద ఘటన జరిగిన ప్రాంతంలో 34 మంది పౌరులు మృతి చెందారు. బాధిత కుటుంబాలకు మద్దతుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


కెప్టెన్ సుమీత్ సబర్వాల్, 10,000 గంటల ఫ్లయింగ్ అనుభవం కలిగిన నిపుణుడు. ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్‌కు 3,400 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది. విమానం రెండు ఇంజన్లు 2025లో చెక్ చేయబడ్డాయి. ఎటువంటి సాంకేతిక సమస్యలు కనిపించలేదు. డీజీసీఏ ఆదేశాలతో 33 బోయింగ్ 787 విమానాల సేఫ్టీ చెక్ ప్రారంభించాము. ఇప్పటి వరకు 26 విమానాలు సేఫ్‌ అని తేలింది. మిగిలినవి వాటి చెకింగ్ జరుగుతోంది. ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్ ప్రక్రియలు డీజీసీఏ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతున్నాయి.


మిడిల్ ఈస్ట్ ఎయిర్‌స్పేస్ క్లోజర్లు, నైట్ రిస్ట్రిక్షన్స్ వల్ల విమానాల రద్దు పెరిగింది. జూన్ 20వ తేదీ నుంచి జూలై మధ్య వరకు ఇంటర్నేషనల్ వైడ్‌బాడీ ఫ్లైట్స్‌ను 15 శాతం తగ్గించనున్నాం. ఫ్లైట్ క్యాన్సల్ జరుగుతున్న సందర్భంలో.. ప్రయాణికులకు రీఫండ్ లేదా రీబుకింగ్ అవకాశం కల్పిస్తున్నాం. బోయింగ్ 787తో పాటు 777 విమానాలపైన అదనపు భద్రతా చెక్‌లు కొనసాగుతాయి’ అని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

వెలుగులోకి కొత్త విషయం.. భార్య మంగళసూత్రం కోసం భిక్షమెత్తి..

చీరలో ఉంటే ఎవరూ కనిపెట్టలేరనుకున్నాడు.. కానీ..

Updated Date - Jun 19 , 2025 | 07:44 PM