Share News

Grand Mother: అమ్మమ్మకు క్యాన్సర్.. మనవడు ఏం చేశాడంటే..

ABN , Publish Date - Jun 24 , 2025 | 09:17 AM

సొంత అమ్మమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ క్రమంలో ఆమెను మనవడితో పాటూ ముంబై పంపించారు..

Grand Mother: అమ్మమ్మకు క్యాన్సర్.. మనవడు ఏం చేశాడంటే..
yashoda gaikwad

ముంబై, జూన్ 24: క్యాన్సర్‌ బారిన పడిన అమ్మమ్మను చెత్తకుప్పలో వదిలేసి వెళ్లిపోయాడో మనవడు. చెత్తకుప్పలో అచేతనంగా పడి ఉన్న వృద్ధురాలిని చూసి స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరిలించారు. ఆమెను చేర్చుకునేందుకు పలు ఆసుపత్రులు నిరాకరించాయి. చివరగా ఆమెను ఒక ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఆరే నగర్ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకుంది.


స్పృహాలోకి వచ్చిన ఆమె తర్వాత తన వివరాలను వెల్లడించింది. తన పేర యశోదా గైక్వాడ్ అని.. తనది మలాడ్ ప్రాంతమని తెలిపింది. మలాడ్ ప్రాంతం నుంచి తన మనవడు ఇక్కడకు తీసుకు వచ్చి వదిలి వెళ్లిపోయాడని చెప్పింది. యశోద గైక్వాడ్ చర్మ క్యాన్సర్‌తో బాధపడుతోంది. దీంతో ఆమె ముక్కు, బుగ్గలు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాయి. ఆమెను జాయిన్ చేసుకునేందుకు ఏ ఆసుపత్రి సిబ్బంది చొరవ చూపడం లేదు.


అమె ఇచ్చిన సమాచారం మేరకు.. ఆయా ప్రాంతాల్లో ఆమె కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నించారు. కానీ అక్కడ ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. అయితే ఆమెను ఆమె కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో ముంబై మహానగరం పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పోలీసులు ఆమె చిత్రాలను పంపారు.


అలాగే మనవడిని గుర్తించేందుకు ఆరే కాలనీ పరిధిలోని సీసీ టీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. జూన్ 21వ తేదీన ముంబై పోలీస్ కంట్రోల్ రమ్‌కు ఆరే కాలనీలోని చెత్త కుప్ప వద్ద ఒక వృద్ధురాలు పడిందని తమకు సమాచారం అందిందని సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి రవీంద్ర పాటిల్ వెల్లడించారు. ఆరే పోలీసలు ఘటనా స్థలానికి చేరుకుని చెత్త కుప్ప వద్ద ఉన్న ఆమెను గుర్తించామని వివరించారు. ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి:

దారుణం.. 30 మంది భార్యలు హతం

ప్రధాని కలుపుగోలుతనం గొప్ప ఆస్తి

For More National News and Telugu News

Updated Date - Jun 24 , 2025 | 11:31 AM