Share News

Amazon: రూ 100 రాఖీ డెలివరీ చేయని అమెజాన్‌కు రూ.40వేల జరిమానా

ABN , Publish Date - May 20 , 2025 | 04:58 AM

ముంబయి జిల్లా వినియోగదారుల ఫోరం అమెజాన్‌కు సకాలంలో రాఖీ డెలివరీ చేయకపోవడంపై రూ.40,000 జరిమానా విధించింది. 2019లో ఆర్డర్ చేసిన రాఖీ రిక్వెస్ట్ సమయానికి అందకపోవడంతో ఆర్డర్ రద్దు చేసి, సొమ్ము తిరిగి జమ చేసినట్లు ఫోరం పేర్కొంది.

Amazon: రూ 100 రాఖీ డెలివరీ చేయని అమెజాన్‌కు రూ.40వేల జరిమానా

ముంబై, మే 19: సకాలంలో రాఖీ డెలివరీ చేయని అమెజాన్‌ సంస్థకు రూ.40వేల జరిమానా విఽధిస్తూ ముంబయి జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పు చెప్పింది. రూ.100 రాఖీకి ఆర్డర్‌ తీసుకున్న అమెజాన్‌ దాన్ని సకాలంలో అందజేయకపోగా, మరుసటి రోజున దాన్ని కాన్సిల్‌ చేసింది. సొమ్మును తిరిగి బ్యాంకు ఖాతాలో జమ చేసింది. సకాలంలో రాఖీ అందజేయకపోవడం సేవా లోపమే అని భావించిన ఫోరం అధ్యక్షుడు సమీందర ఆర్‌ సుర్వే, సభ్యుడు సమీర్‌ కె కాంబ్లే జరిమానా విధించారు. తన మేనల్లుడికి పంపించేందుకు ఓ మహిళ 2019 ఆగస్టు 2న అమెజాన్‌ వెబ్‌సైట్‌ ద్వారా రాఖీని బుక్‌ చేసింది. ధనశ్రీ రాఖీ షాపు నుంచి రూ.100కు మోటూ పట్లూ కిడ్స్‌ రాఖీని కొనుగోలు చేసింది. 2019 ఆగస్టు 8-13 మధ్య అందజేస్తామంటూ మెసేజ్‌ వచ్చింది. కానీ రాఖీ అందలేదు. మరుసటి రోజున ఆ రూ.100 ఆమె బ్యాంకు ఖాతాలో జమయింది. దీంతో, ఆమె ఫోరంను ఆశ్రయించారు.


ఇవీ చదవండి:

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2025 | 04:58 AM