HIV After Donated Blood: అయ్యో పాపం పసి పిల్లలు.. చెయ్యని తప్పుకు దారుణమైన శిక్ష..
ABN , Publish Date - Dec 19 , 2025 | 08:11 AM
సత్నాకు చెందిన కొంతమంది పసికందులు తలసేమియా వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు వారిని చికిత్స నిమిత్తం సత్నా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడి డాక్టర్లు వారికి రక్తం ఎక్కించారు. ఆ రక్తం కారణంగా ఏకంగా ఆరుగురు చిన్నారులు హెచ్ఐవీ బారినపడ్డారు.
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో మానవత్వాన్ని ప్రశ్నించే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. చేయని తప్పుకు ఐదుగురు చిన్నారులు దారుణమైన శిక్ష అనుభవిస్తున్నారు. అభంశుభం ఎరుగని వారు హెచ్ఐవీ బారినపడ్డారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ దారుణం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సత్నాకు చెందిన కొంతమంది పసికందులు తలసేమియా వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు వారిని చికిత్స నిమిత్తం సత్నా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడి డాక్టర్లు వారికి రక్తం ఎక్కించారు. దాదాపు 150 మంది డోనర్ల నుంచి వారికి రక్తం ఎక్కిస్తూ వచ్చారు.
అయితే, రక్తం ఎక్కించిన కొన్ని రోజులకే ఐదు మంది చిన్నారులు అనారోగ్యానికి గురయ్యారు. వారికి రక్త పరీక్షలు చేయగా హెచ్ఐవీ సోకినట్లు తేలింది. దీంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు. తమ బిడ్డల పరిస్థితి తల్చుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఓ డోనర్ రక్తం కారణంగా చిన్నారులకు హెచ్ఐవీ సోకినట్లు దర్యాప్తులో తేలింది. డాక్టర్లు, ల్యాబ్ సిబ్బంది పరీక్షలు నిర్వహించకుండానే డోనర్ల నుంచి రక్తం తీసుకున్నట్లు వెల్లడైంది. ‘ది డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్‌ఫేర్’ ఈ సంఘటనపై సీరియస్ అయింది. దారుణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటోంది.
పిల్లల జీవితాలు నాశనం అవ్వటానికి కారణమైన ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను సస్పెండ్ చేసింది. సత్నా జిల్లా ఆస్పత్రికి చెందిన మాజీ సివిల్ సర్జన్‌కు షో కాజ్ నోటీసులు ఇచ్చింది. సత్నా ప్రభుత్వ ఆస్పత్రిలో గత సంవత్సరం మార్చి నెలలో మొదటి హెచ్ఐవీ పాజిటివ్ కేసు నమోదైంది. మార్చి 20వ తేదీన 15 ఏళ్ల తలసేమియా పేషంట్‌కు హెచ్ఐవీ పాజిటివ్ వచ్చింది. మార్చి 26 నుంచి 28 వరకు మరో ఇద్దరు చిన్నారులకు హెచ్ఐవీ పాజిటివ్ వచ్చింది. ఏప్రిల్ 3వ తేదీన మరో కేసు నమోదు అయింది. మొత్తంగా ఆరు మంది చిన్నారులు హెచ్ఐవీ బారిన పడ్డారు. వరుసగా హెచ్ఐవీ కేసులు బయటపడుతున్నా కూడా ఆస్పత్రి వర్గాల్లో చలనం రాలేదు. నెలల పాటు వాటిని పట్టించుకోలేదు. చివరకు ఈ విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వారు దర్యాప్తు ఆదేశించటమే కాకుండా.. బాధితులపై చర్యలు తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
గంభీర్ కోచ్ కాదు... కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
పోలీసుల కస్డడీకి కీలక మావోయిస్టులు..