Mother Takes Out Rs 40 Lakh Insurance: ఇన్సురెన్స్ డబ్బుల కోసం తల్లి దారుణం.. లవర్‌తో కలిసి కొడుకు మర్డర్..
ABN , Publish Date - Oct 30 , 2025 | 07:56 PM
ఓ తల్లి తన ప్రియుడితో కలిసి కన్న బిడ్డను హత్య చేసింది. మర్డర్‌కు ముందు అతడిపై 40 లక్షల రూపాయల ఇన్సురెన్స్ చేయించింది. మర్డర్‌ను యాక్సిడెంట్‌గా చిత్రీకరించి డబ్బులు కొట్టాయాలని అనుకుంది.
సాధారణంగా ప్రతీ తల్లి తన బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. బిడ్డల కోసం తన సంతోషాన్ని పక్కన పెడుతుంది. తను పస్తులు ఉండి బిడ్డల ఆకలి తీరుస్తుంది. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో ఓ తల్లి అత్యంత క్రూరంగా వ్యవహరించింది. లవర్‌తో కలిసి కన్న కొడుకును మర్డర్ చేసింది. ఇన్సురెన్స్ డబ్బుల కోసం ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కాన్పూర్ దేహత్‌కు చెందిన మమత అనే మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయింది.
భర్త చనిపోయిన కొన్ని నెలలకు మమత అదే ప్రాంతానికి చెందిన రిషీ కతియార్‌తో ప్రేమలో పడింది. ఈ విషయం గురించి మమత కుమారుడు ప్రదీప్‌కు తెలిసింది. దీంతో అతడు తల్లికి వార్నింగ్ ఇచ్చాడు. ప్రియుడితో కలవకుండా కట్టుదిట్టం చేశాడు. ఈ నేపథ్యంలోనే మమత ఆగ్రహానికి గురైంది. ప్రియుడితో కలిసి కొడుకు మర్డర్‌కు ప్లాన్ వేసింది. మర్డర్‌కు ముందు కొడుకుపై 40 లక్షల రూపాయలు విలువ చేసే పాలసీలు తీసుకుంది. మూడు రోజుల క్రితం రిషి, అతడి తమ్ముడు మయాంక్ కలిసి ప్రదీప్‌ను సుత్తెతో కొట్టి చంపేశారు.
మర్డర్‌ను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అక్టోబర్ 27వ తేదీన బల్హరామౌ ప్రాంతంలోని రోడ్డుపై ప్రదీప్ మృతదేహం వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, ప్రదీప్ తాత జగదీష్ నారాయణ్ తన మనువడిని రిషి, మయాంక్‌లు హత్య చేశారని ఆరోపించాడు. గ్రామస్తులతో కలిసి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసును మర్డర్ కేసుగా మార్చారు. మంగవారం రాత్రి నిందితులిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మమత గురించి చెప్పారు. దీంతో పరారీలో ఉన్న మమతను అరెస్ట్ చేయడానికి సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టారు.
ఇవి కూడా చదవండి
సంగం బ్యారేజీ దగ్గర భారీ బోటు తొలగింపు.. టీమ్ వర్క్‌పై మంత్రి లోకేష్ ప్రశంసలు..