Share News

30 Tonne Boat Rescued: సంగం బ్యారేజీ దగ్గర భారీ బోటు తొలగింపు.. టీమ్ వర్క్‌పై మంత్రి లోకేష్ ప్రశంసలు..

ABN , Publish Date - Oct 30 , 2025 | 05:55 PM

సంగం బ్యారేజీ దగ్గర లంగరు తెగిపోయిన 20 టన్నుల పడవను పక్కకు తీసుకురావటానికి 30 మంది ఎన్డీఆర్ఎఫ్, 30 మంది ఎన్డీఆర్ఎఫ్, 100 మంది దాకా పోలీసు, భద్రతా సిబ్బంది, కృష్ణపట్నం పోర్టు టీమ్, పైర్, ఇరిగేషన్ అధికారులు అవిశ్రాంతంగా శ్రమించారు. వీరిపై మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు.

30 Tonne Boat Rescued: సంగం బ్యారేజీ దగ్గర భారీ బోటు తొలగింపు.. టీమ్ వర్క్‌పై మంత్రి లోకేష్ ప్రశంసలు..
30 Tonne Boat Rescued

మొంథా తుపాన్ కారణంగా పెన్నా నదికి భారీగా వరద నీరు పొటెత్తింది. ఈ నేపథ్యంలోనే సంగం బ్యారేజీ దగ్గర ఉన్న 30 టన్నుల భారీ బోటు లంగరు తెగిపోయింది. ఆ బోటు వేగంగా బ్యారేజీ గేట్ల వైపు వెళ్లసాగింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. పడవను విజయవంతంగా పక్కకు తీసుకువచ్చారు. దీంతో బ్యారేజీకి పెను ప్రమాదం తప్పింది. ఇక, ఈ సంఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. పడవను విజయవంతంగా పక్కకు తీసుకువచ్చిన వారిపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.


ఆ పోస్టులో.. ‘నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ వద్దకు లంగరు తెగిపోయిన 30 టన్నుల బరువున్న ఇసుక బోటు గేట్ల వరకూ వచ్చింది. బ్యారేజీ నీటి నిల్వకు తోడు మొంథా తుపాన్ వరద పోటెత్తింది. భారీ బోటు బ్యారేజీ గేట్లకు తగిలి ఉంటే భారీ డ్యామేజీ జరిగేది. సమాచారం అందుకున్న నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ పరిస్థితిని సమీక్షించి బోటు తొలగింపునకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, కృష్ణపట్నం పోర్టు గస్తీ బృందం, ఫైర్, ఇరిగేషన్ అధికారుల బృందం అంతా కలిసి 30 టన్నుల బోటును బ్యారేజీకి ఎలాంటి నష్టం కలగకుండా ఒడ్డుకు చేర్చారు.


టీం వర్క్‌తో అతిపెద్ద జలగండాన్ని తప్పించిన మీ కృషికి హ్యాట్సాఫ్’ అని అన్నారు. కాగా, పడవను పక్కకు తీసుకురావటానికి 30 మంది ఎన్డీఆర్ఎఫ్, 30 మంది ఎన్డీఆర్ఎఫ్, 100 మంది దాకా పోలీసు, భద్రతా సిబ్బంది, కృష్ణపట్నం పోర్టు టీమ్, పైర్, ఇరిగేషన్ అధికారులు అవిశ్రాంతంగా శ్రమించారు. పెన్నా నది ప్రవాహానికి ఎదురెళ్లి మరీ పడవను పక్కకు తీసుకువచ్చారు. లేదంటే బ్యారేజీకి పెద్ద ఎత్తున డ్యామేజీ జరిగి ఉండేది. హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది.


ఇవి కూడా చదవండి

ఈ ఆంటీ తెలివి చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే.. వీడియో వైరల్..

కర్నూలు ఘటన.. కాలిపోయిన బస్సు దగ్గర బంగారం కోసం వెతుకులాట..

Updated Date - Oct 30 , 2025 | 06:07 PM