Share News

Kurnool Bus Tragedy: కర్నూలు ఘటన.. కాలిపోయిన బస్సు దగ్గర బంగారం కోసం వెతుకులాట..

ABN , Publish Date - Oct 30 , 2025 | 05:10 PM

ఈ నెల 24వ తేదీన కర్నూలు జిల్లాలో ఓ బస్సు కాలి బూడిద అయింది. 19 మంది చనిపోయారు. ప్రమాదంలో కాలి బూడిదైన బస్సు దగ్గర తాజాగా కొంతమంది బంగారం కోసం వెతుకులాట ప్రారంభించారు.

Kurnool Bus Tragedy: కర్నూలు ఘటన.. కాలిపోయిన బస్సు దగ్గర బంగారం కోసం వెతుకులాట..
Kurnool Bus Tragedy

కర్నూలు : చిన్న టేకూరులో ఈ నెల 24వ తేదీన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బస్సు అగ్నికి ఆహుతి కావటంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ రోడ్డు ప్రమాదం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గరి నుంచి ప్రధాని వరకు అందరూ ఈ సంఘటనపై స్పందించారు.


తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలు ఇంకా ఆ బాధ నుంచి తేరుకోలేదు. ఇలాంటి సమయంలో కొంతమంది అత్యంత అమానుష పనికి తెరతీశారు.

బస్సు దగ్గర బంగారం కోసం వెతుకులాట..

అగ్గిలో కాలి బూడిద అయిన బస్సును అధికారులు రోడ్డు మీద నుంచి పక్కకు తీసుకువచ్చి పెట్టారు. ఆ బస్సు దగ్గర కొంతమంది బంగారం కోసం వెతుకులాట ప్రారంభించారు. దాదాపు ఎనిమిది మంది దాకా ఆ బస్ దగ్గర బూడిదను సేకరించారు. బస్తాలలో నింపుకున్నారు. వారు ఎంతో ఓపిగ్గా బూడిదను తవ్వి మరీ బస్తాలలో నింపుకున్నారు.


బంగారం వెలికితీయడం కోసమే బూడిదను సేకరించినట్లు తెలుస్తోంది. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు బస్సు దగ్గర బంగారం కోసం వెతుకుతున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఛీ మీరసలు మనుషులేనా’ అంటూ మండిపడుతున్నారు.


ఇవి కూడా చదవండి

విషాదం నింపిన ప్రేమ కథ.. ఏకంగా మూడు ప్రాణాలు..

ఇది మహా విపత్తు కాబట్టి.. ఇలా చేయండి: షర్మిల

Updated Date - Oct 30 , 2025 | 05:17 PM