Lover Beaten To Assassinated: విషాదం నింపిన ప్రేమ కథ.. ఏకంగా మూడు ప్రాణాలు..
ABN , Publish Date - Oct 30 , 2025 | 04:26 PM
ప్రియురాలిని కలవడానికి వెళ్లిన ప్రియుడి జీవితం విషాదంగా ముగిసింది. ప్రియురాలి కుటుంబసభ్యులు అతడ్ని కొట్టి చంపేశారు. ఈ మర్డర్ నేపథ్యంలో ప్రియురాలు, ఆమె బాబాయ్ ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం వారి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఓ ప్రేమ కథ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఓ ప్రాణం బలికాగా, మరో రెండు ప్రాణాలు చావు బతుకుల మధ్య ఆస్పత్రి బెడ్‌పై కొట్టుమిట్టాడుతున్నాయి. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌కు చెందిన 35 ఏళ్ల రవి, పార్చ్ గ్రామానికి చెందిన 18 ఏళ్ల మనీషా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. అయితే, వీరి పెళ్లికి మనీషా ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. బలవంతంగా వేరే అబ్బాయితో పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నారు. ఈ విషయం రవికి తెలిసింది.
రాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. మనీషా కుటుంబసభ్యులు అతడ్ని పట్టుకున్నారు. చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దాడిలో రవి చనిపోయాడు. రవి చనిపోయిన తర్వాత మనీషా కుటుంబసభ్యులు రియలైజ్ అయ్యారు. మర్డర్ కేసు తన మీదకు వస్తుందన్న భయంతో మనీషా బాబాయ్ పింటూ ఆత్మహత్యకు యత్నించాడు. మనీషా కుటుంబసభ్యులు వెంటనే రవిని, పింటును మౌదాహాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. రవిని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని స్పష్టం చేశారు.
పింటు పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. కుటుంబసభ్యులు అతడ్ని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరో వైపు.. రవి చనిపోయాడని తెలియగానే మనీషా ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబసభ్యులు ఆమెను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. పింటు, మనీషాల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పింటూపై రవి దాడి చేశాడని మనీషా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కత్తితో పొడిచాడని చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల నుంచి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ముందస్తు చర్యలతో నష్టం తగ్గింది: డిప్యూటీ సీఎం పవన్
ఇది మహా విపత్తు కాబట్టి.. ఇలా చేయండి: షర్మిల