Ministers: స్మార్ట్ మీటర్ల ఏర్పాటు తర్వాతే నెలవారీ రీడింగ్
ABN , Publish Date - Sep 03 , 2025 | 10:26 AM
స్మార్ట్ మీటర్లుఏర్పాటుచేసిన తర్వాతే నెలవారీ విద్యుత్ రీడింగ్ చేపడతామని విద్యుత్ శాఖ మంత్రి శివశంకర్ తెలిపారు. సచివాలయంలో ఆర్ధిక శాఖ మంత్రి తంగం తెన్నరసు, రవాణా, విద్యుత్ శాఖ మంత్రి శివశంకర్, ఉన్నత విద్యాశాఖ మంత్రి కొవి చెళియన్ మంగళవారం సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటుచేశారు.
- మంత్రి శివశంకర్
చెన్నై: స్మార్ట్ మీటర్లుఏర్పాటుచేసిన తర్వాతే నెలవారీ విద్యుత్ రీడింగ్ చేపడతామని విద్యుత్ శాఖ మంత్రి శివశంకర్ తెలిపారు. సచివాలయంలో ఆర్ధిక శాఖ మంత్రి తంగం తెన్నరసు, రవాణా, విద్యుత్ శాఖ మంత్రి శివశంకర్(Minister Sivashankar), ఉన్నత విద్యాశాఖ మంత్రి కొవి చెళియన్ మంగళవారం సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ... రాష్ట్రంఆర్ధికాభివృద్ధిలో రెండంకెలకు చేరి రికార్డు సృష్టించిందన్నారు.
నాలుగన్నరేళ్లలో ప్రభుత్వ రవాణా శాఖకు 3,700 కొత్త బస్సులు కొనుగోలు చేయగా, మరో 2,200 బస్సులు ఆధునికీకరించామని తెలిపారు. దేశానికి మార్గదర్శకంగా తమిళనాడు(Tamilnadu) నిలిచిందన్నారు.ఉత్తర చెన్నైలో రూ.6,158 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రులుతెలిపారు. సమావేశంలో ఓ విలేకరి డీఎంకే ఎన్నికల హామీల్లో ఒకటైన నెలవారీ విద్యుత్ మీటరు రీడింగ్ ఈ ఏడాదిలో అమలవుతుందా? అంటూ ప్రశ్నించారు.

అందుకు విద్యుత్ శాఖ మంత్రి శివశంకర్ స్పందిస్తూ... స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేసే పనులు జరుగుతున్నాయని, ప నులు పూర్తయిన అనంతరం నెలవారీ విద్యుత్ రీడింగ్ చేపడతామన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత స్మార్ట్ మీటర్లు పూర్తిస్థాయి ఏర్పాటుచేసిన అనంతరం నెలవారీ రీడింగ్ చేపడతామని మంత్రి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలు మరింత పైకి.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
జూబ్లీహిల్స్‌లో 3,92,669 మంది ఓటర్లు
Read Latest Telangana News and National News