Share News

Chennai: కొడైకెనాల్‌ ‘గుణా’ గుహ వద్ద నోట్ల వర్షం కురిపించిన వానరం

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:10 PM

ప్రముఖ పర్యాటక ప్రాంతం కొడైకెనాల్‌ ‘గుణా’ గుహ వద్ద చెట్టుపై కూర్చుని ఓ వానరం ఐదువందల కరెన్సీ నోట్ల కట్ట పట్టుకుని ఒక్కో నోటు విసిరేసిన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తీవ్రంగా వైరల్‌ అవుతోంది.

Chennai: కొడైకెనాల్‌ ‘గుణా’ గుహ వద్ద నోట్ల వర్షం కురిపించిన వానరం

చెన్నై: ప్రముఖ పర్యాటక ప్రాంతం కొడైకెనాల్‌(Kodaikanal) ‘గుణా’ గుహ వద్ద చెట్టుపై కూర్చుని ఓ వానరం ఐదువందల కరెన్సీ నోట్ల కట్ట పట్టుకుని ఒక్కో నోటు విసిరేసిన సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తీవ్రంగా వైరల్‌ అవుతోంది. కొద్ది రోజుల క్రితం గుణా గుహను సందర్శించేందుకు వచ్చిన కర్ణాటకు చెందిన పర్యాటకుడి సంచిని ఓ వానరం లాక్కెళ్లింది. కాసేపయ్యాక ఆ వానరం ఓ చెట్టెక్కి సంచిలో ఉన్న రూ.500 నోట్ల కట్ట పట్టుకుని ఒక్కో నోటు కిందకు వేసింది.


nani2.jpg

దీనితో ఆ కర్ణాటక పర్యాటకుడు కింద పడిన నోట్లను ఏరుకోగా తక్కిన ప్రయాణికులు కూడా నోట్లను సేకరించి ఆయనకు అందజేశారు. అయితే ఆ వానరం విసిరేసిన నోట్లలో కొన్ని గుణా గుహలో పడ్డాయి. ఆ నోట్లను తీయడం కష్టమని తెలుసుకుని, కర్ణాటక(Karnataka) పర్యాటకుడు ఆ వానరం విసిరేసిన నోట్లన్నింటిని ఏరుకుని బయలుదేరాడు. ప్రస్తుతం ఆ వానరం చెట్టుపై నుంచి ఐదు వందల రూపాయల నోట్లను ఒక్కొక్కటిగా విసిరేస్తున్న వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

గరిష్టానికి చేరుకుని, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

‘ధరణి’పై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ షురూ

Read Latest Telangana News and National News

Updated Date - Jun 17 , 2025 | 12:11 PM