PM Modi: ఉత్పత్తుల్లో మనదేశీయుల చెమట చిందాలి
ABN , Publish Date - Aug 27 , 2025 | 02:48 AM
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనదేశంపై విధించిన..
పెట్టుబడి ఎవరు పెట్టినా ఉత్పత్తులు మనదేశంలో జరగాలి: మోదీ
అహ్మదాబాద్/న్యూఢిలీ, ఆగస్టు 26: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనదేశంపై విధించిన 25% అదనపు సుంకాల అమలుకు ఒకరోజు ముందు ప్రధాని మోదీ ‘స్వదేశీ ఉత్పత్తుల’ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. స్వదేశీ, మేక్ ఇండి యా అనేవి కొత్త కొలువులు సృష్టించేందుకు సహాయపడతాయని పేర్కొన్నారు. పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినా ఉత్పత్తి మాత్రం మనదేశంలోనే జరగాలని స్పష్టం చేస్తూ.. స్వదేశీ అనేది ప్రతి ఒక్కరి జీవిత మంత్రంగా ఉండాలని పిలుపునిచ్చారు. రానున్న ఐదారేళ్లలో జపాన్ సంస్థ సుజుకి మోటర్ కార్పొరేషన్ భారత్‌లో రూ.70వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లోని హన్సల్‌పూర్ కర్మాగారంలో విదేశాల ఎగుమతుల కోసం ‘విటారా’ అనే ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ నుంచి తయారైన మొట్టమొదటి వాహనాన్ని మోదీ మంగళవారం ఇక్కడ జెండా ఊపి ఎగుమతులను లాంఛనంగా ప్రారంభించారు. అలాగే ఈవీల్లో కీలకమైన లీథియం-అయాన్ బ్యాటరీ, సెల్, ఎలకో్ట్రడ్ ఉత్పత్తుల ఫ్యాక్టరీని కూడా మోదీ ప్రారంభించారు. కాగా, ప్రధాని మోదీ రెండ్రోజుల పర్యటన నిమిత్తం గురువారం (28న) జపాన్ బయల్దేరనున్నారు. 29, 30 తేదీల్లో ఆ దేశ ప్రధాని షిగెరు ఇషిబాతో కీలక చర్చలు జరుపనున్నారు. 15వ భారత్-జపాన్ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఇషిబాతో మోదీ సమావేశం కానుండడం ఇదే మొదటిసారి. 2014లో ఆయన ప్రధానిగా పగ్గాలు స్వీకరించాక జపాన్ వెళ్లడం ఇది ఎనిమిదో సారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మంగళవారం తెలిపారు. ‘అటు నుంచి అటే చైనాలోని టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సుకు వెళ్తారు. 31, 1 తేదీ ల్లో అక్కడే ఉంటారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో వేర్వేరుగా ము ఖాముఖి భేటీలు నిర్వహిస్తారు’ అని ఆయన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..
Read Latest Telangana News and National News