Share News

PM Modi Highlights : 11 ఏళ్లుగా భారత్‌లో పారదర్శక పాలన

ABN , Publish Date - Aug 07 , 2025 | 04:12 AM

గత 11 ఏళ్లుగా భారత్‌లో పౌరులే కేంద్రంగా పారదర్శక పాలన సాగుతోందని ప్రధాని మోదీ చెప్పారు

PM Modi Highlights : 11 ఏళ్లుగా భారత్‌లో పారదర్శక పాలన

న్యూఢిల్లీ, ఆగస్టు 6: గత 11 ఏళ్లుగా భారత్‌లో పౌరులే కేంద్రంగా పారదర్శక పాలన సాగుతోందని ప్రధాని మోదీ చెప్పారు. ప్రస్తుత సమస్యలను భవిష్యత్‌ తరాలకు వదిలివేయబోమని, దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్ధిక శక్తిగా తీర్చిదిద్దడంలో కలిసి పనిచేద్దామని మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే లక్ష్యంతో నిర్మిస్తోన్న కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ 10 భవనాల్లో మొదటిదైన కర్తవ్య భవన్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. భవనాలన్నీ పూర్తయితే ఏడాదికి రూ.1500 కోట్లు అద్దె రూపంలో మిగులుతాయని ప్రధాని చెప్పారు. కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ 10 భవనాల్లో కర్తవ్య భవన్‌-3లో కేంద్ర హోం, విదేశాంగ, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, పెట్రోలియం శాఖల కార్యాలయాలతో పాటు ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ సలహాదారు కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఊటీలో పర్యాటక ప్రాంతాల మూసివేత.. కారణం ఏంటంటే..

అమిత్‌షాపై పరువునష్టం వ్యాఖ్యలు.. రాహుల్‌కు బెయిల్

Read Latest Telangana News and National News

Updated Date - Aug 07 , 2025 | 04:12 AM