Share News

మోదీ అమెరికా పర్యటన రద్దు

ABN , Publish Date - Sep 07 , 2025 | 06:07 AM

ప్రధాని మోదీ అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నెల చివరిలో అమెరికాలోని ఐక్య రాజ్యసమితి(ఐరాస) సచివాలయంలో 80వ ఉన్నతస్థాయి...

మోదీ అమెరికా పర్యటన రద్దు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: ప్రధాని మోదీ అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నెల చివరిలో అమెరికాలోని ఐక్య రాజ్యసమితి(ఐరాస) సచివాలయంలో 80వ ఉన్నతస్థాయి సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మోదీ హాజరై ప్రసంగించాల్సి ఉంది. అయితే, ట్రంప్‌ విధించిన సుంకాల వైఖరిపై ఆగ్రహంతో ఉన్న ప్రధాని.. ఈ సమావేశానికి దూరంగా ఉండడంతోపాటు తన ప్రసంగాన్నీ రద్దు చేసుకున్నారు. ప్రధానికి బదులుగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ హాజరుకానున్నారు. దీంతో ఈ సమావేశంలో ప్రసంగించే వారి పేర్లను సవరిస్తూ ఐరాస తాజాగా జాబితాను విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు జరిగే సమావేశాల్లో తొలిరోజు ప్రపంచ దేశాల నేతలను ఉద్దేశించి ట్రంప్‌ ప్రసంగించనున్నారు. అనంతరం.. బ్రెజిల్‌ సహా ఇతర దేశాలకు చెందిన నాయకులు ప్రసంగిస్తారు. భారత్‌ తరఫున హాజరయ్యే జైశంకర్‌ ఈ నెల 27న మాట్లాడనున్నారు. కాగా, గత జూలైలో విడుదల చేసిన వక్తల జాబితాలో మోదీ 26వ తేదీన ప్రసంగించనున్నట్టు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

తిహాడ్ జైలును పరిశీలించిన యూకే అధికారులు.. నీరవ్ మోదీ, మాల్యాను అప్పగించే అవకాశం

అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్

For More National News And Telugu News

Updated Date - Sep 07 , 2025 | 08:53 AM