Share News

WB Sports Minister resignation: మెస్సీ కార్యక్రమంలో గందరగోళం.. బెంగాల్ క్రీడాశాఖ మంత్రి రాజీనామా

ABN , Publish Date - Dec 16 , 2025 | 03:55 PM

అర్జెంటీనా ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ ఇటీవల భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. మొదట అతడు కోల్‌కతా చేరుకున్నాడు. అయితే కోల్‌కతాలో మెస్సీ కార్యక్రమం గందరగోళంగా మారింది. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రేక్షుకులు, మెస్సీ అభిమానులు విధ్వంసానికి దిగారు.

WB Sports Minister resignation: మెస్సీ కార్యక్రమంలో గందరగోళం.. బెంగాల్ క్రీడాశాఖ మంత్రి రాజీనామా
Messi GOAT India Tour controversy

అర్జెంటీనా ఫుట్ బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ ఇటీవల భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. మొదట అతడు కోల్‌కతా చేరుకున్నాడు. అయితే కోల్‌కతాలో మెస్సీ కార్యక్రమం గందరగోళంగా మారింది. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రేక్షుకులు, మెస్సీ అభిమానులు విధ్వంసానికి దిగారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి పెద్ద మచ్చగా నిలిచిపోయింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్యల చేపట్టారు (Messi GOAT India Tour).


ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ బెంగాల్ క్రీడాశాఖ మంత్రి అరూప్ బిస్వాస్ తాజాగా రాజీనామా చేశారు. వెంటనే ఆయన రాజీనామాను సీఎం మమత బెనర్జీ ఆమోదించారు. 13వ తేదీన జరిగిన ఘటనపై విచారణ కోసం ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఘటన జరిగిన రోజునే క్రీడాకారులకు మమత క్షమాపణలు చెప్పారు. ఈవెంట్ ఏర్పాటు చేసిన ఆర్గనైజర్లను బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు (Aroop Biswas resigns).

manikanta.jpg


అలాగే మెస్సీ కార్యక్రమంలో (Lionel Messi India visit) గందరగోళం, విధ్వంసంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం డీజీపీ రాజీవ్ కుమార్, బిధన్ నగర్ సీపీ ముఖేష్ కుమార్, యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేష్ కుమార్ సిన్హాలకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కార్యక్రమం జరిగిన రోజున తన విధులు, బాధ్యతలలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డీసీపీ అనీష్ సర్కార్‌పై ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు ప్రారంభించింది.


ఇవి కూడా చదవండి...

భక్తులకు అలర్ట్.. ఆ సేవ రద్దుపై టీటీడీ కీలక ప్రకటన

సంజీవని ప్రాజెక్టుతో డిజిటల్ హెల్త్ రికార్డులు: సీఎం చంద్రబాబు

Updated Date - Dec 16 , 2025 | 03:55 PM