Mental Health: టెన్షన్ టెన్షన్
ABN , Publish Date - Jan 23 , 2025 | 04:58 AM
ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఎన్‌ఆర్ నారాయణమూర్తి, ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్, లాంటివారు సుదీర్ఘ పనిగంటలు ఉండాలని, వారాంతాల్లోనూ పనిచేయాలని అభిప్రాయం వ్యక్తం చేసినా అందుకు యువత మానసికంగా సిద్ధంగా లేదేమో! దేశ వ్యాప్తంగా యువ ఉద్యోగులంతా పని ఒత్తిడి కారణంగా మానసిక ఆరోగ్య సమస్యలతో పెను సవాళ్లు ఎదుర్కొంటున్నారట!
25 ఏళ్లలోపు ఉద్యోగుల్లో తీవ్ర పని ఒత్తిడి!
ప్రతి 10 మందిలో 9 మందికి విపరీతమైన ఆందోళన
యువ ఉద్యోగులకు నిర్మాణాత్మక మద్దతు అవసరం
ఉద్యోగుల సహాయ సేవాసంస్థ ‘వన్ టు వన్’ వెల్లడి
న్యూఢిల్లీ, జనవరి 22: ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఎన్‌ఆర్ నారాయణమూర్తి, ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్, లాంటివారు సుదీర్ఘ పనిగంటలు ఉండాలని, వారాంతాల్లోనూ పనిచేయాలని అభిప్రాయం వ్యక్తం చేసినా అందుకు యువత మానసికంగా సిద్ధంగా లేదేమో! దేశ వ్యాప్తంగా యువ ఉద్యోగులంతా పని ఒత్తిడి కారణంగా మానసిక ఆరోగ్య సమస్యలతో పెను సవాళ్లు ఎదుర్కొంటున్నారట! ఈ మేరకు ‘వన్ టు వన్’ అనే ఉద్యోగుల సహాయ సేవాసంస్థ పేర్కొంది. ‘వన్ టు వన్’ కౌన్సెలింగ్ సెషన్ల డేటా ప్రకారం పాతికేళ్ల వయసు ఉద్యోగుల్లో ప్రతి 10 మందిలో తొమ్మిది మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారట! 25 ఏళ్లలోపు ఉద్యోగుల్లో 90శాతం మంది, 45 ఏళ్లలోపు ఉద్యోగుల్లో 67శాతం ఒత్తిడితో ఆందోళనకు గురవుతున్నారని ఈ సంస్థ పేర్కొంది. యువ ఉద్యోగులకు నిర్మాణాత్మకమైన మద్దతు అవసరమని స్పష్టం చేసింది. నిరుడు జనవరి నుంచి నవంబరు దాకా పనిచేసే చోట ఉద్యోగులు మానసికంగా ఎదుర్కొంటున్న సవాళ్ల మీద ‘వన్ టు వన్’ సంస్థ 83వేల కౌన్సెలింగ్ సెషన్లు, 12వేల సెలెక్టివ్ స్ర్కీమింగ్స్, 42వేల అంచనాలను రూపొందించింది. ఉద్యోగుల్లో 59శాతం మందిలో తమకు తాము హాని చేసుకునే లక్షణాలను గుర్తించిన మేనేజర్లు, సహాయం కోసం రిఫర్ చేసినట్లు వన్ టు వన్ నివేదిక వెల్లడిచించింది. ఉద్యోగుల కుటుంబీకుల్లో చాలామంది తీవ్ర ఒత్తిడితో బాధపడుతూ ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఉద్యోగుల్లో 45ఏళ్లలోపు వారికన్నా 30 ఏళ్లలోపు వారు తీవ్ర డిప్రెషన్, ఆందోళనతో బాధపడుతున్నట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి..
Delhi Assembly Elections: ఆప్ మధ్యతరగతి మేనిఫెస్టో
State Govt: సొంతంగా విమానం కొనుగోలు చేయడం లేదు
influential Indians : సత్యం.. సుందరం!
Read More National News and Latest Telugu News