Share News

Honeymoon Murder: రాజా రఘువంశీ హత్య.. మేఘాలయ పోలీసులపై యూపీ పోలీసు ఉన్నతాధికారి ప్రశంసలు

ABN , Publish Date - Jun 10 , 2025 | 05:46 PM

మేఘాలయ పోలీసులపై యూపీ పోలీసు ఉన్నతాధికారి ప్రశంసలు కురిపించారు. కేసు విచారణలో అద్భుత పనితీరు కనబరుస్తున్నారని అన్నారు.

Honeymoon Murder: రాజా రఘువంశీ హత్య.. మేఘాలయ పోలీసులపై యూపీ పోలీసు ఉన్నతాధికారి ప్రశంసలు
Meghalaya honeymoon murder

మధ్యప్రదేశ్‌ వ్యక్తి రాజా రఘువంశీ హనిమూన్‌లో ఉండగా హత్యకు గురైన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షిల్లాంగ్‌లో హనీమూన్‌లో ఉండగా అతడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు కుట్ర పన్నిన మృతుడి భార్య సోనమ్‌ యూపీలో పోలీసులకు పట్టుబడింది. ఆమె ట్రాన్సిట్ రిమాండ్‌లో ఉంది. మరోవైపు, రఘువంశీని హత్య చేసిన సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా, అతడి స్నేహితులను మేఘాలయ పోలీసులు విచారిస్తున్నారు.

ఇక సోనమ్ తనకు ఎవరో మత్తుమందు ఇచ్చి యూపీకి తీసుకొచ్చారని విచారణలో తొలుత పేర్కొన్నట్టు యూపీ అడిషనల్ జనరల్ అమితాబ్ యశ్ వెల్లడించారు. ‘సోమవారం ఆమె ఘాజీపూర్‌‌లోని ఢాబా వద్దకు చేరుకుంది. ఆ తరువాత తన కుటుంబానికి తాను ఎక్కడున్నదీ సమాచారం అందించింది. పోలీసులు తానున్న చోటకు వస్తారని తెలిసి ఇలా చేసింది. ఆమె కుటుంబసభ్యులు వెంటనే మధ్యప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించారు. వారు యూపీలో స్థానిక పోలీసులను అలర్ట్ చేశారు. దీంతో, వారు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తనకు ఎవరో డ్రగ్స్ ఇచ్చి అక్కడ వదిలిపెట్టారని ఆమె పేర్కొంది. ఆ తరువాత ఆమెను మెడికల్ చెకప్‌కు పంపించాము’


‘సోనమ్‌కు పోలీసుల దర్యాప్తు తీరుతెన్నుల గురించి ఏమీ తెలియదు. బాధితురాలిగా నటించి తప్పించుకుందామని అనుకుంది. కానీ మేఘాలయ పోలీసుల అద్భుతంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసును వారే హ్యాండిల్ చేస్తున్నారు’ అని యశ్ అన్నారు.

రాజా హత్యలో అతడి భార్య సోనమ్ ప్రధాన సూత్రధారి అని మేఘాలయ పోలీసులు బలంగా విశ్వసిస్తున్నారు. ప్లాన్ ఆమెదే అని అనుమానిస్తున్నారు. భర్తను హత్య చేయించేందుకు కాంట్రాక్ట్ కిల్లర్‌లను రంగంలోకి దిపిందని చెబుతున్నారు. రాజాను నిందితులు హత్య చేసి ఓ లోయలో పడేశారు. దాదాపు రెండు వారాల తరువాత అతడి మృతదేహం పోలీసులకు లభించింది. అక్కడికి సమీపంలోనే రక్తపు మరకలు ఉన్న కొడవలిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఇతర నిందితులతో కలిసి సోనమ్ ఉన్నట్టు సీసీటీవీల్లో కనిపించింది. మరోవైపు, రాజా హత్యకు కారణమైన వారిని మరణ శిక్ష విధించాలని మృతుడి కుటుంబం డిమాండ్ చేస్తోంది. నిందితులందరినీ మేఘాలయ పోలీసులు విచారిస్తున్నారు.


ఇవీ చదవండి:

బెంగళూరు తొక్కిసలాట.. బాధితులకు పరిహారాన్ని పెంచిన కర్ణాటక ప్రభుత్వం

ప్రభుత్వ డాక్టర్‌ను సస్పెండ్ చేసిన గోవా ఆరోగ్య శాఖ మంత్రి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 10 , 2025 | 06:48 PM