Share News

Goa Health Minister: ప్రభుత్వ డాక్టర్‌ను సస్పెండ్ చేసిన గోవా ఆరోగ్య శాఖ మంత్రి

ABN , Publish Date - Jun 07 , 2025 | 10:07 PM

గోవా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ వైద్యుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆ డాక్టర్‌ను అప్పటికప్పుడు సస్పెండ్ చేశారు.

Goa Health Minister: ప్రభుత్వ డాక్టర్‌ను సస్పెండ్ చేసిన గోవా ఆరోగ్య శాఖ మంత్రి
Vishwajit Rane doctor suspension

ఇంటర్నెట్ డెస్క్: ఓ ప్రభుత్వ డాక్టర్‌పై బహిరంగంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణె ఆయనను అప్పటికప్పుడు సస్పెండ్ చేయడం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. శనివారం మంత్రి రాణె గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో (జీఎమ్‌సీహెచ్) ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఆసుపత్రిలో ఓ డాక్టర్ పేషెంట్లకు చికిత్స చేసేందుకు నిరాకరించారన్న ఫిర్యాదు అందింది. పేషెంట్లతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఫిర్యాదు అందింది. దీంతో, మంత్రి ఆసుపత్రిలో తనిఖీకి వెచ్చారు. ఈ సమయంలో మెడికల్ సూపరింటెండెంట్ డా, రాజేశ్ పాటిల్ కూడా మంత్రి వెంట ఉన్నారు. ఈ క్రమంలో క్యాజువాలిటీ వార్డులోకి వచ్చిన మంత్రి ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ను ప్రశ్నించారు. ‘మీరు నోటిని అదుపులో పెట్టుకోవాలి. మీరు డాక్టర్. సాధారణంగా నాకు కోపం రాదు. మీరు మాత్రం ప్రవర్తన నియంత్రించుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పేషెంట్లతో మర్యాదగా నడుచుకోవాలి’ అని అన్నారు.


ఆ తరువాత డా. పాటిల్ వైపు చూస్తూ.. ‘ఆయన స్థానంలో మరో సీఎమ్ఓను నియమించండి. ఆయన సస్పెన్షన్ ఫైలుపై నేను సైన్ చేస్తాను. వెంటనే ఆయన సస్పెండ్ కావాలి. ఇలా నేను ఎప్పుడూ అమర్యాదగా మాట్లాడింది లేదు. కానీ దీన్ని మాత్రం సహించను’ అని మంత్రి అన్నారు. పేదలకు సేవ చేయడానికి వైద్యులు ఉన్నారని సీఎమ్‌ఓకు మరోసారి చెప్పారు.


ఈ వీడియో వైరల్ కావడంతో మంత్రిపై గోవా పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి తన అధికారదర్పం ప్రదర్శించారని, ఇది తలవంపులు తెచ్చే ఘటన అని పేర్కొంది. ముందుగా మంత్రి మానసిక స్థితికి సరిగా ఉందో లేదో వైద్య పరీక్షలు చేయించాలని జీపీసీసీ ప్రెసిడెంట్ అమిత్ పాట్కర్ తెలిపారు. ఓ వైద్యుడిని నలుగురిలో నిలబెట్టి అలా అవమానించడం సబబు కాదని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కూడా వైద్యులకు సంఘీభావం తెలిపింది.

ఇవీ చదవండి:

ఏక్‌నాథ్ షిండే గొప్ప మనసు.. పేషెంట్‌ను తన చార్టెడ్ ప్లేన్‌లో ఆసుప్రతికి తరలింపు..

సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలతో పాక్‌కు చుక్కలు.. భారత్‌కు వరుస లేఖలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 07 , 2025 | 11:58 PM