Share News

Honeymoon Horror: భర్త హత్యకు తొలుత రూ.4లక్షల సుపారీ.. ఆపై రూ.20లక్షలకు పెంపు

ABN , Publish Date - Jun 10 , 2025 | 06:48 PM

తన భర్త రాజా రఘువంశీ హత్యకు తొలుత రూ.4లక్షల సుపారీ ఆఫర్ చేసిన సోనమ్ తర్వాత ఆ ఆఫర్‌ను రూ.20లక్షలకు పెంచినట్టు వివ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Honeymoon Horror: భర్త హత్యకు తొలుత రూ.4లక్షల సుపారీ.. ఆపై రూ.20లక్షలకు పెంపు

ఇంటర్నెట్ డెస్క్: హనీమూన్‌లో ఉండగా హత్యకు గురైన మధ్యప్రదేశ్ వ్యక్తి రాజా రఘువంశీ కేసుకు సంబంధించి కీలక అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భర్తను హత్య చేయించేందుకు సోనమ్ తొలుత నిందితులకు రూ.4లక్షల సుపారీ ఆఫర్ చేసిందని పోలీసుల వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఆఫర్‌ను రూ.20లక్షలకు పెంచినట్టు వెల్లడించాయి.

సోనమ్, రాజా దంపతులను నిందితులు తొలుత బెంగళూరులోనే కలుసుకున్నారు. ఆ తర్వాత కనెక్టింట్ ఫ్లైట్‌లో నిందితులు ఈశాన్య రాష్ట్రానికి వెళ్లారు. మే 11న సోనమ్, రాజా వివాహం జరిగింది. కొన్ని రోజులకే వారు రాజా హత్యకు ప్లాన్ చేశారు. సోనమ్ ప్రియుడు షిల్లాంగ్‌కు వెళ్లకపోయినా తెర వెనక ఉండి మరీ కుట్ర పన్నాడు. సోనమ్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నాడు.


మే 21న నవదంపతులు గువహటీకి వెళ్లగా.. నిందితులు వారిని ఫాలో అయ్యారు. మే 22న రాజా, సోనమ్ షిల్లాంగ్‌కు వెళ్లారు. నిందితులు కూడా వారిని అనుసరించారు. ఆ మరుసటి రోజే రాజా హత్య జరిగినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఆ రోజున రాజా, సోనమ్ జలపాతాన్ని చూసేందుకు ఓ కొండ వద్దకు వెళ్లారు. నిందితులు కూడా వారిని అనుసరించారు. ఆ సమయంలోనే సోనమ్ అలసిపోయినట్టు నటించింది. రాజాతోపాటు నిందితుల కంటే వెనకగా నడవడం ప్రారంభించింది.

నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నాక భర్తను హత్య చేయాలని వారికి చెప్పింది. అయితే, అప్పటికే తాము అలసిపోయామంటూ నిందితులు తెలిపారు. ఈ క్రమంలో సోనమ్ సుపారీ ఆఫర్‌‌ను రూ.20లక్షలకు పెంచినట్టు తెలిసింది. ఆ తర్వాత రాజాపై దాడి జరిగింది. అతడి తలపై ముందు, వెనకా గట్టిగా కొట్టడంతో అతడు కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలో మృతదేహాన్ని నిందితులు లోయలోకి తోస్తుంటే సోనమ్ కూడా సహకరించిందని సమాచారం.


జూన్ 2న బాధితుడి మృతదేహం పోలీసులకు లభించగా, మరుసటి రోజే పోలీసులకు సోనమ్‌పై అనుమానం మొదలైంది. భర్త ఫొటోలు లేకుండానే సోషల్ మీడియాలో ఆమె పోస్టులు పెట్టడంతో అనుమానం బలపడింది.

ఇవీ చదవండి:

బెంగళూరు తొక్కిసలాట.. బాధితులకు పరిహారాన్ని పెంచిన కర్ణాటక ప్రభుత్వం

రాజా రఘువంశీ హత్య.. మేఘాలయ పోలీసులపై యూపీ పోలీసు ఉన్నతాధికారి ప్రశంసలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 10 , 2025 | 07:32 PM