Man Helps Wife: భార్యకు ప్రియుడితో పెళ్లి.. పోలీసులకు భర్త విన్నపం..
ABN , Publish Date - Nov 03 , 2025 | 09:37 PM
14 ఏళ్ల పాటు వీరి కాపురం ఎలాంటి గొడవలు లేకుండా సజావుగానే సాగింది. సంవత్సరం క్రితం వీరి ఇంట్లో పని చేయడానికి ఓ యువకుడు వచ్చాడు. యువకుడితో ఆ వ్యక్తి భార్య ఎఫైర్ పెట్టుకుంది.
తన భార్యకు ఆమె ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయాలని కోరుతూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఈ మేరకు పోలీసులకు వినతి పత్రం సమర్పించాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన 38 ఏళ్ల ఓ వ్యక్తికి 15 ఏళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన యువతితో పెళ్లయింది. పెళ్లి సమయంలో యువతి తల్లిదండ్రులు సరూర్‌పూర్‌లో ఓ స్థలం కానుకగా ఇచ్చారు.
భార్యాభర్తలు ఆ స్థలంలో ఇళ్లు కట్టుకుని అక్కడే ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు. 14 ఏళ్ల పాటు వీరి కాపురం ఎలాంటి గొడవలు లేకుండా సజావుగానే సాగింది. సంవత్సరం క్రితం వీరి ఇంట్లో పని చేయడానికి ఓ యువకుడు వచ్చాడు. యువకుడితో ఆ వ్యక్తి భార్య ఎఫైర్ పెట్టుకుంది. ఆరు నెలల క్రితం ఈ విషయం గురించి భర్తకు తెలిసింది. భార్యను నిలదీశాడు. ఆమె ఎలాంటి భయం లేకుండా.. ‘అవును.. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. పెళ్లి కూడా చేసుకుందామని అనుకుంటున్నాం’ అని అంది.
భర్త ఎంత నచ్చజెప్పినా ఆమె వినలేదు. ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పింది. భార్య మీద ఉన్న ప్రేమతో ఆ వ్యక్తి సరేనన్నాడు. ఇద్దరికీ దగ్గరుండి మరీ పెళ్లి చేస్తానని మాటిచ్చాడు. ఇందుకోసం తన ముగ్గురు పిల్లల్ని కూడా ఒప్పించాడు. ముందుగా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. తర్వాత అతడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా తన భార్య పెళ్లిని ప్రేమించిన వాడితో జరిపించాలని కోరాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
ఇవి కూడా చదవండి
మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 17 సెకెన్లలో కనిపెట్టండి
హిమాలయాల్లో ఐరన్ టిన్.. పాపం ఆ ఎలుగుబంటి..