Share News

Meerut: దెబ్బతగిలి ఆస్పత్రికి వెళితే.. వైద్యుడు చేసిన పనికి షాక్..

ABN , Publish Date - Nov 20 , 2025 | 04:47 PM

గాయంతో ఆస్పత్రికి వెళితే.. వైద్యులు వైద్యం చేస్తారు. గాయం తగ్గేందుకు అవసరమైన చికిత్స అందిస్తారు. కానీ, ఈ వైద్యుడు మాత్రం తన రూటే సపరేటు అంటున్నాడు.. అతని వైద్య విధానం తెలిస్తే మీరు సైతం ఖంగుతింటారు. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి..

Meerut: దెబ్బతగిలి ఆస్పత్రికి వెళితే.. వైద్యుడు చేసిన పనికి షాక్..
Meerut doctor Fevikwik incident

మీరట్, నవంబర్ 20: వైద్యో నారాయణ హరి అంటారు. మనుషుల ప్రాణాలను కాపాడే వైద్యుడిని.. ఆ నారాయణుడి రూపంగా భావిస్తారు. కానీ, కొందరు వైద్యులు.. తమ చేష్టల కారణంగా వైద్య వృత్తికే కలంకం తీసుకువస్తున్నారు. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వెలుగు చూసింది. అసలు విషయం తెలిస్తే.. అసలు అతను డాక్టర్ ఎలా ఎయ్యాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇంతకీ ఏం జరిగింది..? అతను చేసిన నిర్వాకమేంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం..


మీరట్‌లోని జాగృతి విహార్ ఎక్స్‌టెన్షన్‌లోని మాపుల్స్ హైట్స్‌లో సర్దార్ జస్పిందర్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి రెండున్నర సంవత్సరాల పిల్లవాడు మన్రాజ్ సింగ్ ఉన్నాడు. అతను ఆడుకుంటున్న సమయంలో టేబుల్ కార్నర్ అతని కన్ను సమీపంలో బలంగా తగిలింది. దీంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఇది గమనించిన పిల్లాడి తల్లిదండ్రులు. మీరట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పిల్లాడిని పరిశీలించిన డాక్టర్.. రూ. 5 ఫెవిక్విక్ తీసుకువచ్చి.. గాయం అయిన చోట ప్యాచ్ చేశాడు. కాసేపట్లో నొప్పి తగ్గిపోతుందంటూ వారికి చెప్పి పంపించేశాడు. కానీ, ఆ చిన్నారి గాయం నొప్పిని భరించలేకపోయాడు. దీంతో తల్లిదండ్రులు ఆ చిన్నారిని మరో ఆస్పత్రికి తీసుకువెళ్లారు.


గాయమైన చోట ఫెవిక్విక్ అంటించడంతో సమస్య మరింత పెద్దదైంది. ఆ ఫెవిక్విక్ తొలగించడానికే వైద్యులకు 3 గంటల సమయం పట్టింది. ఆ తరువాత చిన్నారి గాయానికి వైద్యులు చికిత్స చేశారు. నాలుగు కుట్లు పడినట్లు తెలిపారు. ఫెవిక్విక్ కంట్లోకి వెళ్లి ఉంటే.. పరిస్థితి మరింత సీరియస్ అయ్యేదని వైద్యులు తెలిపారు. కాగా, ఈ వ్యవహారం వైరల్ అవడంతో ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీనిపై దర్యాప్తు జరిపి ఫెవిక్విక్‌తో ట్రీట్‌మెంట్ చేసిన వైద్యుడిపై చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు తెలిపారు.


Also Read:

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు అరెస్ట్

నేపాల్‌లో మళ్లీ జెన్-జీ నిరసనలు.. కర్ఫ్యూ విధింపు

Updated Date - Nov 20 , 2025 | 05:50 PM