Share News

Kumbh Mela,: మహాకుంభమేళాకు వెళ్లే రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌

ABN , Publish Date - Feb 10 , 2025 | 04:35 AM

25 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్థంభించిపోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రయాగ్‌రాజ్‌కు దారి తీసే వారణాసి, లక్నో, కాన్పూర్‌, రేవా మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి.

Kumbh Mela,: మహాకుంభమేళాకు వెళ్లే రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌

ప్రయాగ్‌రాజ్‌, ఫిబ్రవరి 9: మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తుతుంటంతో ప్రయాగ్‌రాజ్‌ చేరుకునే అన్ని రోడ్డు మార్గాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. 25 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్థంభించిపోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రయాగ్‌రాజ్‌కు దారి తీసే వారణాసి, లక్నో, కాన్పూర్‌, రేవా మార్గాలన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రయాగ్‌రాజ్‌కు దారితీసే ఏడు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ను 20 కిలోమీటర్ల ముందే నిలిపివేస్తున్నారు. దీంతో పుణ్యస్నానాలాచరించే సంగమ ప్రాంతానికి వెళ్లేందుకు భక్తులు కనీసం 20 కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని తెలిసింది. రద్దీని నియంత్రించేందుకు అధికారులు మధ్యప్రదేశ్‌లోనే వాహనాలను నిలిపివేస్తున్నారు. కనీసం 50 వేల వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. 48 గంటలుగా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయామని భక్తులు చెబుతున్నారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారి కోసం అధికారులు తాగునీరు, ఆహారంతో పాటు తాత్కాలిక వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 14 వరకు ప్రయాగ్‌రాజ్‌ సంగం రైల్వేస్టేషన్‌ను మూసివేయాలని నిర్ణయించినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి..

Delhi: ముంచుకొస్తున్న మరో ఎన్నిక, ఇక పార్టీల ఫోకస్ దానిపైనే..

Delhi CM: ఢిల్లీ సీఎం అతిషి రాజీనామా.. అసెంబ్లీ రద్దు

Delhi CM: ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఢిల్లీని బీజేపీ పాలించినపుడు ఏం జరిగిందంటే..

For More National News and Telugu News..

Updated Date - Feb 10 , 2025 | 05:07 AM