Canara Bank Theft: కెనరా బ్యాంకులో 59 కిలోల బంగారం చోరీ
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:18 AM
కర్ణాటక మంగోలీ కెనరా బ్యాంకులో 59 కిలోల బంగారాన్ని దొంగతనం చేసుకున్నారు. వారం రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది, పోలీసుల విచారణ మొదలైంది.
విజయపుర, జూన్ 2: కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ దొంగతనం జరిగింది. ఆ రాష్ట్రంలోని మంగోలీ శాఖలో డిపాజిటర్లు తనఖాపెట్టిన 59 కిలోల బంగారాన్ని దొంగలు దోచుకుపోయారు. వారం తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విజయపుర ఎస్పీ లక్ష్మణ్ బి.నింబర్గి సోమవారం ఈ విషయాన్ని విలేకరులకు వెల్లడించారు. ‘బ్యాంకు సిబ్బంది గత నెల 23న సాయంత్రం బ్యాంకుకు తాళాలు వేశారు. 24(నాలుగో శనివారం), 25 తేదీల్లో సెలవు. 26వ తేదీన ప్యూన్ తలుపులు తెరిచేందుకు రాగా.. షట్టర్ తాళాలు పగిలి ఉండడం గమనించాడు. సిబ్బంది తనిఖీచేయగా.. 59 కిలోల బంగారం మాయమైనట్లు తేలింది.
ఇవీ చదవండి:
కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్
పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి