Maoist Surrender: 16 మంది మావోయిస్టుల లొంగుబాటు
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:25 AM
ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లా ఎస్‌పీ ఎదుట 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ ఘటనతో కెర్లపెండ గ్రామం మావోయిస్టుల నియంత్రణ నుంచి విముక్తి పొందింది, ప్రభుత్వ అభివృద్ధి పనులు చేపడతారు.
చర్ల, జూన్ 2(ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్‌లోని సుకుమా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ఎదుట సోమవారం 16 మంది మావోయిస్టులు లొంగి పోయారు. వీరందరిపై సుమారు రూ.26 లక్షల రివార్డు ఉంది. లొంగిపోయినవారిలో సెంట్రల్ రీజనల్ కమిటీకి చెందిన రిటా అలియాస్ సుక్కీ, రాహుల్ పునెం, లెకం లఖ్మా ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టుల్లో పీఎల్‌జీఏ చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉన్నారని, గతంలో ఛత్తీ్‌సగఢ్‌లో జరిగిన పలు విధ్వంసకర ఘటనలు, దాడుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు. తాజాగా లొంగిపోయినవారిలో 9 మంది మావోయిస్టులు చింతలనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెర్లపెండ గ్రామానికి చెందినవారు. వీరి లొంగుబాటుతో కెర్లపెండ గ్రామం మావోయిస్టుల నుంచి విముక్తి పొందింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున కోటి రూపాయల అభివృద్ధి పనులను గ్రామంలో చేపట్టనున్నారు.
ఇవీ చదవండి:
కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్
పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి