Share News

Aadhaar Update: 5 ఏళ్లు దాటాక పిల్లల ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి

ABN , Publish Date - Jul 16 , 2025 | 05:39 AM

బాల ఆధార్‌ తీసుకున్న పిల్లలు ఐదేళ్ల తర్వాత తప్పనిసరిగా వేలిముద్రలు, కనుపాపలు, ఫొటో అప్‌డేట్‌ చేయాలని, లేకపోతే వారి ఆధార్‌ డీ యాక్టివేట్‌ అవుతుందని భారత విశిష్ట గుర్తింపు...

Aadhaar Update: 5 ఏళ్లు దాటాక పిల్లల ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి

  • 7 ఏళ్లు దాటినా చేయకపోతే డీ యాక్టివేట్‌

బాల ఆధార్‌ తీసుకున్న పిల్లలు ఐదేళ్ల తర్వాత తప్పనిసరిగా వేలిముద్రలు, కనుపాపలు, ఫొటో అప్‌డేట్‌ చేయాలని, లేకపోతే వారి ఆధార్‌ డీ యాక్టివేట్‌ అవుతుందని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ పేర్కొంది. ఐదేళ్ల లోపు పిల్లలకు బయోమెట్రిక్‌, ఐరిస్‌ అవసరం లేకుండా కేవలం ఫొటో మాత్రమే తీసుకొని యూఐడీఏఐ బాల ఆధార్‌ ఇస్తోంది. అటువంటి పిల్లలు ఏడేళ్లు దాటక మునుపే తప్పనిసరి వారి బయోమెట్రిక్‌, ఐరిస్‌, ఫొటోను వారి దగ్గరలోని ఆధార్‌ కేంద్రాలలో అప్‌డేట్‌ చేసుకోవాలని వారి ఆధార్‌లో నమోదై ఉన్న ఫోన్‌ నెంబర్‌కు యూఐడీఏఐ సందేశాలు పంపించింది. ఐదు నుంచి ఏడేళ్ల లోపు పిల్లలు ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకుంటే ఉచితమని, ఏడేళ్లు దాటిన పిల్లలకు రూ.100 చెల్లించాలని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

ఇక సమోసా, జిలేబీలకూ సిగరెట్ ప్యాకెట్ తరహా హెచ్చరికలు..

మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్‌పై దాడి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 16 , 2025 | 05:58 AM